చిరంజీవి హీరోయిన్.. క్యూలో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు!

Published : Jan 08, 2020, 05:16 PM IST
చిరంజీవి హీరోయిన్.. క్యూలో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు!

సారాంశం

ఎనభై, తొంభై దశాబ్దాలలో తన నటనతో విశేషంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చాలా కాలంగా ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అమెరికా సెటిల్ అయిన ఆమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు. 

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆపద్భాంధవుడు' సినిమాలో నటించిన హీరోయిన్ మీనాక్షీ శేషాద్రి గుర్తున్నారా..? ఈ సినిమా తరువాత ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు. సౌత్ లో ఈ బ్యూటీ పెద్దగా నటించలేదు.

కానీ బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించారు. ఎనభై, తొంభై దశాబ్దాలలో తన నటనతో విశేషంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చాలా కాలంగా ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అమెరికా సెటిల్ అయిన ఆమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు.

కానీ తాజాగా ఈమె అభిమానులను పలకరించారు. వివరాలలోకి వెళితే.. మీనాక్షీ శేషాద్రి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచున్నారు. అయినప్పటికీ ఆమెని ఎవరూ గుర్తు పట్టలేదు.

ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. దీంతో పాటు తన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఎనిమిది గంటల పాటు క్యూలో వెయిట్ చేశానని.. అయినా ఎవరూ గుర్తుపట్టలేదని.. ఇది అమెరికా అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?