భారత రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి!

By tirumala ANFirst Published Dec 30, 2019, 5:16 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి తెలుగువారి అభిమాన నటుడు. దశాబ్దాలుగా తన నటనతో తెలుగు వారికి హృదయాల్లో చెరగనిముద్ర వేశారు. దశాబ్దాల కాలం పాటు చిరంజీవి టాలీవుడ్ లో రారాజుగా వెలుగొందారు. మధ్యలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి తెలుగువారి అభిమాన నటుడు. దశాబ్దాలుగా తన నటనతో తెలుగు వారికి హృదయాల్లో చెరగనిముద్ర వేశారు. దశాబ్దాల కాలం పాటు చిరంజీవి టాలీవుడ్ లో రారాజుగా వెలుగొందారు. మధ్యలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాలు చిరంజీవికి కలసి రాలేదు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరు ఓటమి చెందిన సంగతి తెలిసిందే. 

అనంతరం తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, అల్లు అరవింద్ లది విడదీయరాని బంధం. అల్లు అరవింద్ నిర్మాతగా, చిరు స్టార్ గా టాలీవుడ్ లో ఎదిగారు. ప్రజారాజ్యం పార్టీలో కూడా అరవింద్ కీలక భాద్యతలు నిర్వహించారు. 

చిరంజీవి రాజకీయాల్లో అనుకున్నంత సక్సెస్ కాలేదు కానీ.. నటనలో మాత్రం ఎన్నో శిఖరాలని అధిరోహించారు. 2006లో భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. చిరంజీవి కళా నైపుణ్యానికి గాను డాక్టరేట్ కూడా లభించింది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని భవిష్యత్తులో ఎలాంటి స్థాయిలో చూడాలని అనుకుంటున్నారని ప్రశ్నించగా అరవింద్ ఆశ్చర్యాన్ని కలిగించే సమాధానం ఇచ్చారు. చిరంజీవిని 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'గా చూడాలనేది తన డ్రీమ్ అని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. 

అల్లు అరవింద్ కోరిక నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాష్ట్రపతి పదవి అనేది సాధారణమైన విషయం కాదు. రాజకీయాల్లో తలపండిన వ్యక్తులు, భారత రాజ్యాగాన్ని అవపోసన పట్టిన వారికి మాత్రమే ఆ పదవి దక్కుతుంది. మరి చిరంజీవి లాంటి వ్యక్తికి రాష్ట్రపతిగా అవకాశం దక్కుతుందా అనేది ప్రశ్నార్థకమే. 

రామ్ చరణ్ తో ప్రయోగం చేయనున్న మాస్ డైరెక్టర్ ?

అల్లు అరవింద్ వ్యాఖ్యలతో ప్రస్తుతం కొత్త చర్చ జరుగుతోంది. చిరంజీవి ఇప్పటివరకు రాజకీయాల్లో పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా మాత్రమే పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. అలాంటప్పుడు చిరు రాష్ట్రపతి పదవి స్థాయికి చేరుకోవడం సాధ్యమేనా అనేది ప్రశ్న. 

కేసీఆర్ ముందే జోకులేసిన విజయ్ దేవరకొండ!

కానీ చిత్ర పరిశ్రమలో ఉన్న అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తుల పేర్లు కూడా రాష్ట్రపతి రేసులో అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ కోణంలో ఏమైనా అల్లు అరవింద్ చిరంజీవి కూడా రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారేమో. 

click me!