ఈ డైరెక్టర్ బండి మీద అరటిపళ్లు అమ్మేవాడట!

By AN TeluguFirst Published Dec 30, 2019, 5:15 PM IST
Highlights

మారుతి తండ్రి రోడ్డు మీద తోపుడు బండిలో అరటిపళ్లు అమ్మేవారట. మారుతి సైతం అప్పుడప్పుడూ బండిలో అరటిపళ్లు అమ్మేవారట. దీంతో పాటు బైకులకు స్టిక్కరింగ్ చేసే పని కూడా చేసేవారట. 

సాధారణం నేపధ్యం నుండి వచ్చి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి తమ టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు మారుతి కూడా అదే కోవలోకి వస్తాడు. అతడు ఎలాంటి నేపధ్యం నుండి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.

మారుతి తండ్రి రోడ్డు మీద తోపుడు బండిలో అరటిపళ్లు అమ్మేవారట. మారుతి సైతం అప్పుడప్పుడూ బండిలో అరటిపళ్లు అమ్మేవారట. దీంతో పాటు బైకులకు స్టిక్కరింగ్ చేసే పని కూడా చేసేవారట. అంతేకాదు.. ఒక ఆఫీస్ లో బాయ్ గా కూడా పని చేశాడట. తను ఈరోజు స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ తన మూలాల్ని ఎప్పుడూ మర్చిపోలేదు.

వాళ్ల వరసలకి మా రొమాన్స్ తో సంబంధం లేదు..

తన గతం గురించి ఎప్పుడూ దాచుకోలేదు. గతంలోనే దీని గురించి చెప్పిన మారుతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకొచ్చాడు. తన గతం గురించి తానెప్పుడూ గర్వంగా చెప్పుకుంటానని చెప్పిన మారుతి.. ఇప్పటికీ ఎక్కడైనా అరటిపళ్ల బండ్లు కనిపించినా.. బైకులకు స్టిక్కరింగ్ వేయడం చూసినా.. ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటానని చెప్పారు.

తన కొత్త సినిమా 'ప్రతిరోజు పండగే' చిత్రీకరణ సందర్భంగా ఒకరోజు సెట్లో అరటిపళ్ల బండి తీసుకొచ్చి పెట్టారని.. అది చూడగానే దాని దగ్గరకి వెళ్లిపోయి.. 'ఆరోజుల్లో నేను కూడా అరటిపళ్లు అమ్మేవాడిని కదా' అని ఆలోచిస్తూ నిలబడిపోయానని మారుతి వెల్లడించాడు.

దాన్ని ఫోటో తీసి చిన్నప్పటి జ్ఞాపకాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశానని మారుతి తెలిపారు. తన సొంతూరు మచిలీపట్నం నుండి హైదరాబాద్ వచ్చి యానిమిఎశన్ స్టూడియోలో ఫ్యాకల్టీగా చేరానని.. అక్కడ బన్నీతో పరిచయం, మెల్లగా ఇండస్ట్రీ వైపు అడుగులు పడ్డాయని.. స్నేహితులతో కలిసి 'ఈరోజుల్లో' సినిమా చేసినట్లు చెప్పుకొచ్చారు.  

click me!