గజ్వేల్‌: వారం రోజుల్లో పెళ్లి.. బ్యాంకు ఉద్యోగిని దారుణహత్య

Siva Kodati |  
Published : Feb 18, 2020, 09:54 PM ISTUpdated : Feb 18, 2020, 10:49 PM IST
గజ్వేల్‌: వారం రోజుల్లో పెళ్లి.. బ్యాంకు ఉద్యోగిని దారుణహత్య

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో దారుణహత్య జరిగింది. పట్టణంలో ఓ యువతి దారుణహత్యకు గురైంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో దారుణహత్య జరిగింది. పట్టణంలో ఓ యువతి దారుణహత్యకు గురైంది. ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో పనిచేస్తున్న దివ్య అనే యువతి తన గదిలోనే హత్యకు గురైంది.

విధులు ముగించుకుని రూమ్‌కు చేరుకున్న దివ్యను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య కిరాతకంగా హతమార్చారు. ఆమె స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట. ఈ నెల 26న దివ్య వివాహం జరగాల్సి ఉంది.

పెళ్లికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆమె దారుణ హత్యకు గురికావడం పలు అనుమానాలను కలిగిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read:

వరంగల్‌లో దారుణం: యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

బండరాళ్లతో మోది యువతి హత్య

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?