తండ్రి మృతితో కుటుంబ సభ్యుల కళ్లెదుటే గోదావరిలో దూకిన బాలిక

Published : Feb 18, 2020, 04:41 PM IST
తండ్రి మృతితో కుటుంబ సభ్యుల కళ్లెదుటే గోదావరిలో దూకిన బాలిక

సారాంశం

రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించడాన్ని తట్టుకోలేక ఓ బాలిక గోదావరిఖని సమీపంలో గోదావరి నదిలో దూకి గల్లంతైంది. కుటుంబ సభ్యుల ఎదుటే ఆ అమ్మాయి గోదావరిలో దూకడం తీవ్ర సంచలనం సృష్టించింది.

గోదావరిఖని: తండ్రి మరణం తట్టుకోలేక ఓ అమ్మాయి కుటుంబ సభ్యుల ఎదుటే గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ  మృతి చెందిన తండ్రి మరణం తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకింది. 

మంగళవారం జరిగిన సంఘటన గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు కు చెందిన అరవెల్లి వసంతం సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

 కాగా వసంతం మృతదేహాన్ని వాహనంలో తీసుకెళ్తుండగా,  కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్న వసంతం కూతురు ఆరవెల్లి సాయి ప్రియ (32) వాంతులు వస్తున్నాయి అనడంతో క గోదావరి బ్రిడ్జి ఆప గా సాయి ప్రియ కిందికి దిగి గోదారిలో దూకి గల్లంతయింది. 

కుటుంబ సభ్యుల కళ్లెదుటే సాయి ప్రియ గోదావరి నదిలో మునిగిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. కాగా సాయి ప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి ఎస్సీ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు