టిడిపి ప్రభుత్వ సిట్ రిపోర్టును వైసిపి ఎందుకు బయటపెట్టడంలేదంటే...: సిపిఐ (ఎం)

By Arun Kumar P  |  First Published Oct 25, 2019, 3:12 PM IST

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విశాఖ భూకుంభకోణానికి సంబంధించిన సిట్ రిపోర్టును ప్రజలముందుంచాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది.  గత ప్రభుత్వం ఈ పని చేయలదని వైఎస్సార్‌సిపి ప్రభుత్వమయినా ఈ పని చేయాలని సూచించారు.  


విశాఖపట్నం:  గత ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన వేలాది ఎకరాల భూ కుంభకోణాలపై సిట్ నివేదిక ప్రజలకు అందుబాటులో వుంచాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు సిహెచ్ నర్సింగ్ రావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆ పని చేయలేదని.... వైఎస్సార్‌సిపి ప్రభుత్వం వెంటనే ఆ సిట్ రిపోర్టును బహిర్గతం చేసి దోషులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

గ్రేటర్ విశాఖ సిపిఐ (ఎం) సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జగదాంబ జంక్షన్ పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ... టిడిపి పరిపాలనా కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక భూ ఆక్రమణలు, భూకబ్జాలు జరిగాయని ఆరోపించారు.  ఇలా జరిగిన భూ కుంభకోణాలపై ఆరోపణలు రావడంతో 2017 లో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని  గుర్తుచేశారు.

Latest Videos

undefined

ఆరు నెలలు దర్యాప్తు చేసిన సిట్ బృందం 1300 పేజీలతో లక్షా పత్రాలతో పరిశీలన చేసి నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికలో టిడిపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల కు భూకబ్జాలతో ప్రమేయం ఉండడంతో తొమ్మిది నెలల పాటు సీఎం చంద్రబాబు నాయుడు నివేదికను బహిర్గతం చేయకుండా కాలయాపన చేసి తదుపరి ఎన్నికలకు వెళ్లారన్నారు. 

read more ఏపిలో భారీ ఉద్యోగాల భర్తీ... సీఎం జగన్ ఆదేశం

విశాఖ భూ కబ్జాలతో ప్రమేయం ఉన్న 140 మంది రాజకీయ నాయకులు, అధికారులు, సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి క్రిమినల్ కేసులు పెట్టమని సిట్ దర్యాప్తు సంస్థ ప్రభుత్వానికి నివేదించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.   

గతంలో టిడిపి జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖలో జరిగిన భూకబ్జాలలో తమ పార్టీకి చెందిన ఒక జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం ఉన్నట్లు స్వయంగా ఓప్రెస్ మీట్  ఏర్పాటు చేసి చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదని అన్నారు.  

విశాఖ నగరం చుట్టుపక్కల 14 మండలాల్లో భూ అక్రమాలపై లోతైన దర్యాప్తు జరగాలని అన్నారు. ఆరు వేల ఎకరాల భూములు రికార్డుల్లో ట్యాంపరింగ్ జరిగిందని, దీన్ని సర్వే నెంబర్లతో సహా నిర్ధారించడం జరిగిందని అన్నారు. ఇందులో ఇప్పటి అధికార పార్టీ వైఎస్సార్‌సిపి ప్రమేయం కూడా వున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందువల్లే వైఎస్సార్సిపి ప్రభుత్వం ఈ నివేదికను బయటపెట్టడానికి జంకుతున్నట్లుందని అన్నారు.

read more  బాబుతో లాలూచీ-జగన్ తో పేచీ, ఇదేనా నీ పవనిజం: మంత్రి నాని ఫైర్

ప్రభుత్వ ప్రైవేటు భూముల ఆక్రమణలు రికార్డుల టాంపరింగ్ జరిగినట్టు గుర్తించిన నాలుగు వేల ఎకరాల్లో క్రయవిక్రయాలు జరక్కుండా నిషేధించాలని గత సిట్ సిఫార్సు చేసిందన్నారు.  250 ఎకరాలు సంబంధించిన భూముల్లో అక్రమంగా ఇచ్చిన 43 ఎంఓసి లను రద్దు చేయాలని... ఆ భూములను 22ఏ కింద చేర్చాలని సూచించినట్లు తెలిపారు. 

భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కూడా సీట్ నివేదిక సిఫార్సు చేసిందని తెలిపారు. అయితే ఈ సిట్ సిపార్సులను వైఎస్సార్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి డాక్టర్ బి. గంగారావు పాల్గొన్నారు.

 
 

click me!