టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. అదేక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు.
అమరావతి: తమపై వైసిపి నాయకులు చేస్తున్న ప్రతి విమర్శకు సమాధానం చెప్పడానికి సిద్దంగా వున్నామని... అయితే అసలు సమాధానం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తమకు అవకాశమిస్తే వారు చేస్తున్నవన్నీ అబద్దపు ప్రచారాలని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి తమ గొంతు నొక్కుతున్నారని అన్నారు.
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశం గురించి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మీడియాపై ఆంక్షలు, ఆర్టీసీ ఛార్జీల పెంపు, ఉల్లిధరలపై చర్చకు తాము పట్టుబడితే అవకాశం ఇవ్వట్లేదన్నారు.
undefined
ఉల్లిధరలపై చర్చ కోరితే సమాధానం చెప్పకుండా మహిళలపై దాడులను తెరపైకి తెచ్చారని అన్నారు. ఉల్లిపాయల బదులు క్యాబేజీ వాడుకోవచ్చుగా అంటూ ఓ మంత్రి ఎగతాళి చేశారని మండి పడ్డారు. ప్రజల సమస్యలపై ఎగతాళిగా మాట్లాడటం వైసిపి నాయకులకు అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి సాంబయ్య అనే వ్యక్తి మృతిచెందితే ప్రభుత్వం కనీసం ఓ ప్రకటన అయినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం దున్నపోతులా వ్యవహరిస్తూ దేనిపైనా స్పందించడం లేదన్నారు.
తిరుమల అగ్నిప్రమాదం వెనుక పెద్ద కుట్ర...: శ్రీనివాసానంద సరస్వతి సంచలనం
మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే అధికారపార్టీ ఎమ్మెల్యేలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని... నెల్లూరులో ఎంపీడీవో సరళపై దాడి చేసిన చరిత్ర వారిదని ఆరోపించారు. తమ జిల్లాలో అరాచక శక్తులున్నాయని నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పాడని గుర్తుచేశారు.
మంగళవారం ఉదయం కూడా మళ్లీ రైతు సమస్యలపై ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన తెస్తామన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
సభా సాంప్రదాయాల ఉల్లంఘన ఎక్కడెక్కడ జరుగుతుందో స్పీకర్ దృష్టికి తెస్తామన్నారు. డిప్యూటీ సీఎంలు పోడియం దగ్గర ఆందోళన చేసిన సందర్భాలున్నాయా?అని ప్రశ్నించారు. తన వాయిస్ ప్రజల్లోకి వెళ్లాలనే ఆనం వ్యాఖ్యల సందర్భంగా గట్టిగా మాట్లాడానని చంద్రబాబు వివరణ ఇచ్చారు.
హెరిటేజ్ ఫ్రెష్ తనది కాదన్న విషయం ప్రభుత్వంలో మంత్రులకు తెలియదా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి మైక్ ఇమ్మని అడుక్కోవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నన్ను దారుణంగా అవమానించి మనోధైర్యం దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు.
read more తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పిన ఏపీ సీఎం వైయస్ జగన్
బుధవారం అసెంబ్లీలో పత్రికలపై విధించిన ఆంక్షలపై పోరాటం చేస్తామన్నారు. ఆ తర్వాత గవర్నర్ ను కలుస్తామన్నారు. టిడిపి ఎమ్మెల్యేల ఆర్ధిక మూలాలను దెబ్బతీసి, బెదిరించి లొంగదీసుకుంటున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అని ఎప్పుడో చెప్పామని తెలిపారు.
13 కేసుల్లో 43 వేల కోట్ల అవినీతి చేసిన తమకు ఇతరుల గురించి మాట్లాడే హక్కుందా? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని... కానీ మీరలా కాదన్నారు. మాట్లాడితే దత్తపుత్రుడంటున్నారని... వ్యక్తిత్వ హననానికీ హద్దులుంటాయని హెచ్చరించారు.
గతంలో జగన్ తండ్రి వైఎస్సార్ తనపై 26 కేసులు పెట్టించాడని... అవన్నీ ఏమయ్యాయని అన్నారు. వివేకా హత్య తామే చేశామని ఓ ఎమ్మెల్యే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని... ఆ హత్య చేసిందేవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.