ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి జాతీయాధ్యక్షులు అమిత్ షా ను పొగడటం వెనుకున్న రహస్యాన్ని మంత్రి కొడాలి నాని బయటపెట్టారు.
అమరావతి: టిడిపి అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి పర్యటనలో జరిగిన గందరగోళంపై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. ఆయన వాహనంపై చెప్పులు, రాళ్లు విసిరింది రాజధాని రైతులేనని స్పష్టం చేశారు.
రాజధాని నిర్మాణం పేరుతో కల్లబొల్లి కబుర్లు చెప్పి అక్కడి రైతుల నుండి 33 వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు మోసం చేసాడని ఆరోపించారు. ఇలా మోసగాడి చేతిలో మోసపోయామని రైతులే ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. కానీ టిడిపి నాయకులు మాత్రం ఈ దాడి వైసీపీ రౌడీలు చేశారని గగ్గోలు పెడుతున్నారని... నిజానిజాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని సూచించారు.
undefined
read more అమిత్ షాయే కరెక్ట్, ఉక్కుపాదంతో తొక్కేస్తారు: బీజేపీపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్ర గవర్నర్ ను కలిసిన టిడిపి నాయకులు ప్రభుత్వం, డీజీపీపై ఫిర్యాదు చేశామని సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నిజంగానే దాడులు చేయాలనుకుంటే జిల్లాల పర్యటనలో చేయలేమా? అని అన్నారు. కానీ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి గాని, వైసీపీకి గాని అలాంటి ఆలోచన లేదన్నారు.
read more బార్ ల లైసెన్సుల రద్దు... ఏపి ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు
వారి దరిద్రపు మొహాలు టీవీలో కనపడకపోతే జనం మరిచిపోతారని ఈ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా తమకొచ్చే నష్టమేమీ లేదని... ఆయన బతికుండగా జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు.
చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి పప్పు కూడా ట్విట్టర్,యూట్యూబ్ లకు మాత్రమే పరిమితం అవుతాడని జోస్యం చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మూడు నెలలకోసారి బయటికి వచ్చి చంద్రబాబు తా అంటే తందాన అంటాడని విమర్శించారు. పవన్ ఒక్కడు గుర్తించకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలా అని ప్రశ్నించారు.
వర్షాల వల్ల ఉల్లిపాయల సమస్య వచ్చిందని... కానీ ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా సామాన్యులకు కేవలం రూ. 25 రూపాయలకే రైతు బజార్లలో ఉల్లిపాయలు అందిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని పవన్ గమనించాలని సూచించారు.
read more జగన్ మతం మానవత్వం కాదు... మూర్ఖత్వం: దేవినేని ఉమ
జనసేన పార్టీని బీజేపీ లో విలీనం చేయాలని గతంలోనే పవన్ మంతనాలు జరిపారని అన్నారు. ఇప్పుడు మళ్లీ విలీనం చేయడం కోసమే అమిత్ షాను పొగుడుతున్నారు కావచ్చని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాని వ్యతిరేకించారు కాబట్టే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. మీలా అమిత్ షా, మోడీలను పొగిడితే జైలుకు ఎందుకు వెళ్తారన్నారు. మా మాటల వల్ల దిశా లాంటి ఘటనలు జరిగితే మరి పవన్ వల్ల ఇంకేమి జరగాలని నాని అన్నారు.