అమ్మాయి కోసం... టిక్ టాక్ లో వీడియో చేసి యువకుడి ఆత్మహత్యాయత్నం

By Arun Kumar P  |  First Published Dec 3, 2019, 8:16 PM IST

ప్రేమ విఫలమైందన్న విషయాన్ని ఓ యువకుడు టిక్ టాక్ వీడియో ద్వారా తెలియజేసి ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాదం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో చోటుచేసుకుంది.  


కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమ విఫలమైందని మనస్థాపానికి గురయిన ఓ యువకుడు టిక్ టాక్ ద్వారా ఓ వీడియో సందేశాన్ని ప్రేయసికి పంపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు కొన ఊపిరితో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. 

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండపేట పార్థసారధి నగర్ కు చెందిన డోలు విజయ్ కుమార్(21) స్ధానికంగా ఓ పరుపులు ఫ్యాక్టరీలో పని చేసి జీవనం సాగిస్తున్నాడు. ఇతని తల్లి డోలు వెంకటలక్ష్మి రైస్ మిల్ లో పని చేస్తోంది. 

Latest Videos

విజయ్ కుమార్ గతంలో ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ మెన్ గా పని చేసేవాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న మరో యువతి స్నేహితురాలు ఇతనికి పరిచయమైంది. ఆమెది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని రాపాక. కాగా అక్కడికి విజయ్ తరచూ వెళ్లి ఆమెతో పరిచయం పెంచుకోవడంతో ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

read more  శాడిస్ట్ భర్త: భార్య కాళ్లు చేతులు కట్టేసి స్నేహితులతో కలిసి......

కాగా ఇరవై రోజుల క్రితం రాపాక వెళ్లిన విజయ్ మైనర్ బాలికయిన యువతిని తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యువతి అక్క, బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ వివాహం చెల్లదంటూ బాలికను వారి  అక్కా బావలకు అప్పగించారు. కావాలంటే బాలిక మైనారిటీ తీరిన తర్వాత వివాహం చేసుకోవాలని సూచించారు.

 యువతిని ఆమె అక్క బావ వారి స్వగ్రామానికి తీసుకు వెళ్లి పోయారు. ఆ తర్వాత కూడా కొద్దీ రోజులు వీరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో యువతి బావ విజయ్ కుమార్ ను గట్టిగా హెచ్చరించాడు. ఆ తర్వాత ఆమెను కలుసుకోడానికి రాపాకకు వెళ్లినా కలవడం కుదరలేదు. దీంతో విజయ్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. 

 ఈ నేపథ్యంలో గత నెల 27 గురువారం తన ఇంట్లో టిక్ టాక్ వీడియో చేశాడు. తన సందేశాన్ని ప్రేయసి వరకు చేర్చాలని కోరుతూ వీడియో అప్ లోడ్ చేసాడు. తన ప్రేమకు కారణం యువతి అక్కబావే నని ఆరోపించాడు. అలాగే ఆ యువతి తనను ప్రేమిస్తున్నట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని లేఖ సైతం పోస్ట్ చేసాడు. తమ ప్రేమకు అడ్డుపడ్డారంటూ మనోవేదనకు గురయ్యాడు.తన ఆత్మహత్యకు కారణం వారేనంటూ పేర్కొన్నాడు. 

video:ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన పోలీస్... అభినందించిన జగన్

అనంతరం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. దీన్ని స్థానికులు గమనించి అతన్ని కాపాడి హుటాహుటిన మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ కేజీహెచ్ తరలించారు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతడు రూపొందించిన వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.
 

click me!