ఇరిగేషన్ లోనే కాదు విద్యాశాఖలోనూ రివర్స్ టెండరింగ్... ప్రకటించిన జగన్ ప్రభుత్వం

Published : Dec 16, 2019, 09:56 PM ISTUpdated : Dec 17, 2019, 01:48 PM IST
ఇరిగేషన్ లోనే కాదు విద్యాశాఖలోనూ రివర్స్ టెండరింగ్... ప్రకటించిన జగన్ ప్రభుత్వం

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి రివర్స్ టెండరింగ్ ద్వారా భారీగా ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు ప్రకటించింది. అలాగే విద్యాశాఖలో కూడా ఈ రివర్స్ టెండరింగ్ ను ఉపయోగించనున్నట్లు  ప్రకటించింది.  

అమరావతి: సోమశిల హై లెవెల్ కెనాల్ లో రివర్స్ టెండరింగ్  గ్రాండ్ సక్సెస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా రూ.67.9 కోట్ల ప్రజాధనం ఆదా అంటే 13.48 శాతం  నిధులు మిగులు మిగిల్చినట్లు వెల్లడించింది. 

ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలలకు గుడ్ల సరఫరాపై  కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాసిరకం సరకును సరఫరా చేస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో వుంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

జిల్లా స్థాయిలో గుడ్ల సేకరణ పాత టెండర్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలను మార్చి గుడ్ల సేకరణకు కొత్తగా టెండర్లను జారీ చేస్తామని ప్రభుత్వం తమ ఆదేశాల్లో పేర్కోంది. ప్రభుత్వంరివర్స్ టెండరింగ్ ప్రకారమే గుడ్లను కొనుగోలు చేస్తామని పాఠశాల విద్యాశాఖ  స్పష్టం చేసింది.  

read more చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్పి సమావేశం... చర్చించిన అంశాలివే

ప్రస్తుతం జిల్లాస్థాయి కమిటీ వీటిని కోనుగోలు చేసి సరఫరా చేస్తోందని.. జాతీయ గుడ్ల సమన్వయ సంఘం (నెక్) నిర్ధారించిన ధరలకే కొనుగోలు చేస్తున్నా.. రవాణాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ విద్యాశాఖ విడుదల చేసిన జీవోలో పేర్కోంది. 

గ్రామీణ, గిరిజన ప్రాంతాలతో అన్ని చోట్లకూ కనీసం పదిరోజులకు ఓమారు సరఫరా చేయాలని  ప్రభుత్వం పేర్కోంది. ప్రతీ గుడ్డూ కనీసం 50 గ్రాములు ఉండాలని నిబంధన విధించింది.  పాఠశాల విద్యాశాఖ పేర్కోన్న విద్యా డివిజన్ లో సరఫరా చేసే విధంగా నూతన టెండర్ విధానంను రూపొందించింది.

video: రూపుదిద్దుకున్న మహిళా కమీషన్ లోగో... ఆవిష్కరించి జగన్ 

జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విద్యా డివిజన్ కొనుగోలు కమిటీలు ఏర్పడనున్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా  36.1 లక్షల మంది విద్యార్ధులకు గుడ్లను పంపిణీ చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 

ఒకటో తరగతి నుంచి 10 తరగతి వరకూ చదివే విద్యార్ధులకు మద్యాహ్న భోజన పథకంలో భాగంగా గుడ్లను అందిస్తున్నారు. వారంలో ఐదు రోజుల పాటు విద్యార్ధులకు పౌష్టికాహారంగా గుడ్లు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Mutton : కిలో చికెన్ ధరకే కిలో మటన్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే..!
Vande Bharat Sleeper Train : హైదరాబాద్ టు డిల్లీ లగ్జరీ ట్రైన్ జర్నీ.. వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలివే