అమరావతి రాజధానిగా పనికిరాదని ఆ కమిటీయే చెబుతోంది: బొత్సా సంచలనం

By Arun Kumar P  |  First Published Dec 16, 2019, 8:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే రాజధానిపై గందరగోళంలో వున్న రాష్ట్ర ప్రజలకు బొత్స వ్యాఖ్యలు మరింత గందరగోళంలోకి నెట్టింది.   


అమరావతి:  టీడీపి సభ్యుల మాటల్లో వారు దోచుకున్నది, ఆక్రమించుకున్నది ఏమైపోతుందోనన్న భయం కనబడుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. టిడిపి పాలనలో బడుగు బలహీనవర్గాలను ఏమాత్రం పట్టించుకోలేదని... కానీ తమ ప్రభుత్వం అలా కాకుండా వారిని అక్కున చేర్చుకుంటోందని అన్నారు. బలహీనవర్గాలకు సముచిత స్ధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నది వైసిపి ప్రభుత్వమేనని అన్నారు. 

శాసనమండలిలో మంత్రి బొత్స ఎస్టీ బిల్లు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలను కూడా సభలో ప్రస్తావించారు. రాజధాని భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారని... అప్పుడే పీవోటి యాక్ట్, అసైన్డ్ భూముల చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం అతిక్రమించిందని ఆరోపించారు. చట్టం ప్రకారం అసైన్డ్ భూములు కొనుగోలు చేయకూడదు... కాని రాజధాని ముసుగులో అసైన్డ్ భూముల కొనుగోళ్ళు జరిగాయని అన్నారు.

Latest Videos

undefined

అసైన్డ్ భూముల కొనుగోళ్లపై ఎంక్వైరీ జరుగుతోందని... ఎవరెవరు ఇలాంటి భూములు కొన్నారో బయటపెడతామన్నారు. రేపు ఇంటిపేర్లతో సహా ఈ జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. మొదట్లో సిఆర్‌డిఎ పరిది 217 కిలో మీటర్లుగా ఉందని... చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడి కోసం ఆ పరిధిని పెంచారన్నారు.

video: మూడేళ్లలో 20వేల ఉద్యోగాల భర్తీ...: బ్రాండిక్స్ సీఈవో వెల్లడి

కేవలం ఎకరం లక్ష‌చొప్పున 498 ఎకరాలను ఆ వియ్యంకుడికి  కట్టబెట్టారని  ఆరోపించారు. ఆయన ఏ సామాజిక వర్గమో ఎమ్మెల్సీ  రాజేంద్రప్రసాద్ చెప్పాలన్నారు. అసైన్డ్ భూముల కొనుగోళ్ళను క్యాన్సిల్ చేసేందుకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని వెళ్లడించారు.

శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ, గుంటూరు మధ్య అతి సారవంతమైన భూములున్నాయని తెలిపినట్లు... ఈ ప్రాంతం రాజధానికి అనువైంది కాదని తెలిపిందన్నారు. అతి సారవంతమైన ఈ నేలలో రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులుంటాయని తెలిపిందన్నారు.

తప్పని తిప్పలు... క్యూలో నిల్చుని ఉల్లిపాయలు కొన్న మాజీ ఎమ్మెల్యే

తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం 102 అడుగుల పిల్లర్లు భూములోకి దింపారని గుర్తుచేశారు. దీనివలన ఖర్చు పెరిగిందన్నారు. రాష్ట్ర సమగ్ర అబివృద్ది, రాజధాని కోసం జిఎన్ రావు కమిటీ వేసినట్లు...రిపోర్టును పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 

click me!