కరోనా బారినుండి బైటపడి... కర్నూల్ కు చేరుకున్న జ్యోతి

By Arun Kumar PFirst Published Mar 14, 2020, 5:58 PM IST
Highlights

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో చైనాలో చిక్కుకుపోయిన కర్నూల్ జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి ఎట్టకేలకు సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు. 

కర్నూల్: నెలరోజుల  ఉత్కంఠ తర్వాత కర్నూల్ యువతి అన్నెం జ్యోతి స్వస్థలానికి చేరుకున్నారు. అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో చైనాలోని వ్యూహాన్ లో చిక్కుకున్న ఆమెన భారత విదేశాంగ శాఖ అధికారులు సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగలిగారు. 15 రోజుల క్రితమే ఇండియాకు వచ్చిన ఆమె తాజాగా స్వగ్రామానికి చేరుకుంది. 

కర్నూల్ జిల్లాకు చెందిన అన్నెం జ్యోతికి ఇటీవలే ఉద్యోగం రాగా సదరు కంపనీ శిక్షణ నిమిత్తం ఆమెను చైనాకు పంపించారు. ఇదే సమయంలో చైనాలో కరోనా మహమ్మారి విజృంభించింది.  జ్యోతి నివాసమున్న వ్యూహాన్ ప్రాంతంలో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా వుండటంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు  ఏర్పడ్డాయి. 

కరోనా వైరస్ : చైనాలో చిక్కుకున్న జ్యోతికోసం మహానందిలో ప్రత్యేకపూజలు

ఈ క్రమంలో ఇండియాకు రావాలనుకున్న ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఆమెకు ఈ వైరస్ సోకకున్నా జ్వరం వుండటంతో అనుమానించిన అధికారులు ఎయిర్ పోర్టులోకి  కూడా రానివ్వలేదు. ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో చైనాలో చిక్కుకుపోయిన ఆమెను కాపాడాలంటూ కుటుంబసభ్యులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.  

దీంతో అధికారులు భారత విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో వారు చైనా విదేశాంగ అధికారులు మాట్లాడి జ్యోతిని 15 రోజుల క్రితం ఇండియాకు తీసుకురాగలిగారు. కానీ ఆమెను వెంటనే స్వస్థలానికి పంపించకుండా ఈ 15రోజులపాటు మానేసర్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 

read more  ఎట్టకేలకు ఢిల్లీ చేరిన కర్నూలు జ్యోతి.. ఆనందంలో కుటుంబసభ్యులు

ప్రస్తుతం జ్యోతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో స్వస్థలానికి పంపించారు. దీంతో డిల్లీ నుండి హైదరాబాద్‌ కు చేరుకున్న ఆమె అక్కడినుండి కర్నూల్‌కు వెళ్లారు. కర్నూల్ కు చేరుకోగానే జ్యోతి భావోద్వేగానికి లోనయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్న ఆమెను చూసి కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

వూహాన్‌లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతి: ఢిల్లీకి ఫ్యామిలీ మెంబర్స్


 

click me!