దిశ నిందితుల ఎన్కౌంటర్... మంత్రిగా కాదు ఆడపిల్ల తండ్రిగా చెప్పేదిదే: మంత్రి అవంతి

By Arun Kumar P  |  First Published Dec 6, 2019, 5:58 PM IST

సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ పై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్  స్పందించారు. ఈ సమయంలో మంత్రిగా కంటే ఆడపిల్ల తండ్రిగా  స్పందిస్తేనే బావుంటుందన్నారు.  


విశాఖపట్నం: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్ దిశ అత్యంత దారుణ హత్యాచారానికి గురయిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందుతులు శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ కాల్పుల్లో హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ పై అవంతి విద్యాసంస్థల అధినేత, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందించారు.  

దిశపై జరిగిన అఘాయిత్యం, ఇప్పుడు నిందితుల ఎన్కౌంటర్ పై తాను మంత్రిగా కంటే ఓ ఆడపిల్ల తండ్రిగా స్పందిస్తేనే బావుంటుందన్నారు. ఆడపిల్ల తండ్రిగా దిశపై జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూనే నిందితులపై జరిగిన ఎన్కౌంటర్ ను సమర్దిస్తున్నట్లు  తెలిపారు. మహిళలకు రక్షణ వుండాలంటే కఠిన  చర్యలు అవసరమని అన్నారు. 

Latest Videos

భారతదేశం కాబట్టి నిందితుల పోలీస్ కాల్పుల్లో చనిపోయారని గల్ఫ్ వంటి దేశాల్లో అయితే బహిరంగంగా రాళ్లతో కొట్టి  చంపుతారని అన్నారు. కఠిన చట్టాలతోనే మహిళా రక్షణ సాధ్యమని... చట్టాలను మార్చి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని ఆయన తెలిపారు. 

read more  DishaCaseAccusedEncounter:ఈ ఎన్‌కౌంటర్ సమర్థనీయమే: సిపిఐ నారాయణ

ఆడపిల్లలకు చిన్నతనం నుండే వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్పించాలని సూచించారు. ఇలాంటివి క్లిష్ట సమయాల్లో మహిళలకు మనోదైర్యాన్ని  ఇవ్వడమే కాదు అవసరమైతే రక్షణను కల్పిస్తాయన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో చిన్నారులు, యువతులకు వ్యక్తిగత శిక్షణపై ప్రత్యేక  శిక్షణ ఇవ్వాలని సూచించారు. 

దిశకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పురుషుడు మహిళకు అండగా ఉండాలని  మంత్రి సూచించారు.

read more  DishaCaseAccusedEncounter : మా ఆయనను ఏడ సంపిండ్రో...ఆడ్నే నన్ను సంపుండ్రి...

తెలంగాణ వెటర్నరీ వైద్యురాలు దిశను గత నెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 
 

click me!