విషాదం... మూడు నెలల గర్భిణి దారుణ హత్య, భర్తే హంతకుడా...?

Published : Dec 06, 2019, 03:50 PM ISTUpdated : Dec 06, 2019, 03:56 PM IST
విషాదం... మూడు నెలల గర్భిణి దారుణ హత్య, భర్తే హంతకుడా...?

సారాంశం

కృష్ణా జిల్లా భీమవరంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్నవాడే మూడు నెలల గర్భిణిని అత్యంత దారుణంగా హతమర్చిన దారుణ ఘటన వెలుగుచూసింది.  

విజయవాడ: కృష్ణాజిల్లా పెడన సమీపంలోని పడతడిక గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య గర్భిణిగా వుండగా ప్రేమగా చూసుకోవాల్సిన భర్తే అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.  మానవత్వాన్ని మరిచి ఆ కసాయి భర్త భార్యను అత్యంత పాశవికంగా ఉరేసి చంపాడు. ఇలా భార్యనే కాదు ఆమె కడుపులో పెరుగుతున్న చిన్నారిని నేలమీదకు రాకుండా చిదిమేశాడు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పడతడిక గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (28 ) మూడు సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించి మరీ మదర్ థెరిసా(22) అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ జంట స్వగ్రామంలో కాకుండా బీమవరంలో నివాసముంటున్నారు. వీరికి ఇప్పటికే ఓ బాబు వుండగా ప్రస్తుతం థెరిసా మూడు నెలల గర్భణిగా వుంది. 

అయితే పెళ్లయిన కొద్దిరోజులకే ఈ జంట మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఇవీ మరీ ఎక్కువయిపోయి నాగేశ్వరరావు భార్యపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో థెరిసాను అకాల మరణానికి గురయ్యింది. అయితే భర్తే ఆమెను ఉరివేసి చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. 

DishaCaseAccusedEncounter:ఈ ఎన్‌కౌంటర్ సమర్థనీయమే: సిపిఐ నారాయణ

మూడో నెల గర్భిణి అనికూడా చూడకుండా తోడుగా ఉండాల్సిన భర్తే భార్యను కడతేర్చడంతో మృతురాలు తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో భీమవరం ప్రాతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మృతురాలి కుటుంబసభ్యలు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి ఆమె మరణానికి గల కారణాలను గుర్తించే పనిలో వున్నట్లు పోలీసులు తెలిపారు. 

నందిగామలో తప్పిపోయిన బాలుడు ... జిరో ఎఫ్ఐఆర్ నమోదు

 
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌