అధికారికంగా...అమరావతి నుండి రాజధాని తరలింపు షురూ

By Arun Kumar PFirst Published Feb 1, 2020, 3:01 PM IST
Highlights

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి మరో రెండు ప్రాంతాలకు తరలించడానికి జగన్ ప్రభుత్వం చట్టపరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కార్యాలను ఒక్కోటిగా తరలించడం కూడా ప్రారంభించారు. 

అమరావతి: ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పెండిగ్ లో వుండగానే జగన్ సర్కర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మొదటి అడుగు వేసింది. వెలగపూడి నుంచి సచివాలయం తరలింపును ప్రారంభించింది.

ప్రస్తుతం రాజధాని అమరావతి  ప్రాంతంలోని సచివాలయంలో ఉన్న రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అదికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 

హైకోర్టుతో పాటు న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటిని కర్నూలులో పెడతామని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. ఇందులో భాగంగానే మొదట విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూల్ కు తరలిస్తోంది. 

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం: మోడీ వైపు జగన్, బాబు చూపు

సచివాలయంలో ఉన్న కార్యాలయాలు తరలిస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కార్యాలయాల కోసం అవసరమైన భవనాలు ఎంపిక చేసి ఏర్పాట్లు చేయాలని కర్నూలు కలెక్టర్, ఆర్అండ్‌బీ అధికారులకు సీఎస్ నీలం సాహ్ని అదేశాలు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వస్తాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి ఏపిలో ఆందోళనలు మొదలయ్యాయి. నెలలు గడుస్తున్నా అమరావతి ప్రాంతంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

ఇప్పడున్నట్లే అమరావతిలో చట్టసభలు కొనసాగుతూనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.  
పాలన ఒక దగ్గర, జూడీషియల్ ఒక దగ్గర ఉండాలని సీఎం తెలిపారు. దీనిపై ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదికలు రావడం... అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు పెట్టడం వంటి ప్రక్రియలు ముగిశాయి. 

వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలనం: అర్థరాత్రి జీవో జారీ

అయితే శాసనమండలిలో ఈ బిల్లును అడ్డుకోవడంతో మూడు రాజధానుల నిర్ణయానికి కాస్త బ్రేక్ పడిందని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలను కర్నూల్ కు తరలించాలన్న జగన్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
  
 

click me!