
విజయవాడ: నగరంలోని భవానీపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఒంటరి మహిళను ఇంట్లోనే అత్యంత దారుణంగా హతమార్చిన గుర్తుతెలియని దుండగులు ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్ళారు. కుటుంబసభ్యులు ఇంటికి చేరుకున్న తర్వాత మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం గురించి బయటపడింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ భవానీపురంలో యేదుపాటి పద్మావతి అనే మహిళ కుటుంబంతో కలిసి నివసించేవారు. అయితే ఇవాళ ఆమె ఇంట్లో ఒంటరిగా వున్నట్లు గుర్తించిన కొందరు దుండగులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఆమెను అత్యంత దారుణంగా గొంతుకోసి హతమార్చి ఒంటిపై వున్న బంగారు ఆభరణాలు దోచుకున వెళ్ళారు.
read more ఇప్పటికే ఆర్టీసి, పెట్రోల్ పై బాదుడు... త్వరలో ఏపి ప్రజలపై మరో భారం: అనిత
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులకు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.