ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...
వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151
గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కుటుంబంలో చిన్న చిన్న ఆందోళనలు వస్తాయి. ఫలితంగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒకరి పరిచయం ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తారు. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు కష్టపడితే మంచి ఫలితాలుంటాయి. వ్యాపారవేత్తలకు వారి పనిలో వైవిధ్యం ఉంటుంది. అలాగే గౌరవ మర్యాదలు పొందుతారు. తల్లిదండ్రులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. సంతానం వృద్ధి ఉంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) వారికి :- ఈ రోజు నూతన ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సమగ్రంగా తెలుసుకోండి. పెట్టుబడులు పెడితే కలిసి వస్తుంది. సమయంలో ఆఫీసులోని సహచరుల వల్ల మనసు కలత చెందుతుంది. పని ప్రదేశంలో తీరిక లేకుండా గడుపుతారు. సహోద్యోగుల సాయంతో మీరనుకున్న పనిని పూర్తి చేస్తారు. ప్రభుత్వాధికారుల సాయంతో వ్యాపారంలో శుభవార్తలు అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు తీవ్రమవుతాయి. కుటుంబ వ్యాపారంలో తండ్రి మార్గనిర్దేశం చేస్తారు. ఇది మనస్సును మెప్పిస్తుంది. వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఈ రోజంతా అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబ వాతావరణంలో ఒత్తిడి నెలకొంటుంది. మాతృమూర్తి విభేదాలు తలెత్తవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు వ్యాపార తరగతులు నూతన ఉత్పత్తిని వాణిజ్యంలో పొందుపరుస్తారు. కుటుంబ సంపద పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో రహస్య శత్రువుల మీ పనిని మెచ్చుకుంటారు. తద్వారా కొంత కాలం తలపైకెత్తుకోలేరు. రిస్కుతో కూడిన ఎలాంటి పనులు తీసుకోకండి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ రోజు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితుల వల్ల లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదం, గొడవలు తలెత్తే అవకాశముంది. సోదరుల మద్దతుతో లాభాలు అందుకుంటారు. కార్యాలయంలో అధికారులు, సహచరుల నుంచి సహకారం, గౌరవం పొందుతారు. నూతన ఆలోచనతో ముందుకు సాగితే మంచిది. ఫలితంగా ప్రయోజనం అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు మీరు స్నేహితులకు సాయం చేస్తే ప్రజలు మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. నిజాయితీతో ఈ రోజు మీ చేసే ఏ పని అయినా విజయవంతమవుతుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. తీరిక లేకుండా మీరు గడుపుతారు. కార్యాలయంలో ఏకాగ్రతతో చేసిన పని వల్ల ప్రయోజనం ఉంటుంది. ఫలితంగా ఆనందంగా ఉంటారు. పెద్దవారి జోక్యంతో ఉద్రిక్తత తగ్గుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మీరు ఉదయం నుంచి ఉల్లాసంగా ఉంటారు. ఫోన్ ద్వారా ఓ శుభవార్త అందుకుంటారు. కార్యాలయంలో పనిచేసే సహచరుల నుంచి కృషితో సంతోషంగా ఉంటారు. లావాదేవీల విషయంలో ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో గుర్తింపు లభిస్తుంది. ఫలితంగా వారితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. తోబుట్టువుల అవసరాలను తీరుస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. తల్లి నుంచి ప్రత్యేక మద్దతు ఉంటుంది. వేడుకలను చేర్చవచ్చు. ఈ రోజు మీరు పెద్ద వ్యక్తులను కలిసే అవకాశముంది. వారి సాయంతో పనిలో ఆందోళన తగ్గుతుంది. ప్రారంభంలోనే కష్టపడాల్సి వస్తుంది, అనంతరం కలిసి వస్తుంది. మీ ఆరోగ్య విషయంలో అప్రమత్తతగా ఉండాల్సిన అవసరముంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ రోజు ఉపాధి అవకాశాలు బాగా ఉన్నాయి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నట్లయితే అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు వ్యాపారంలో లాభం వస్తుందనే ఆశ ఉంటుంది. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అయితే ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరముంది. మీరు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకపోవడం మంచిది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ రోజు విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల సాయంతో కుటుంబ సమస్యలు ముగుస్తాయి. ప్రేమ జీవితంలో మనశ్శాంతి ఉంటుంది. కార్యాలయంలో బృంధంగా పనిచేయడానికి శుభంగా ఉంటుంది. ఫలితంగా మీరు మంచి ప్రయోజనాలు అందుకుంటారు. పరస్ఫర సంభాషణలతో నూతన ఆలోచనలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. నూతన పెట్టుబడులకు ఈ సమయం సరైంది కాదు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు కుటుంబ వ్యాపారాన్ని విస్తరించడానికి దృఢమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధువర్గాల నుంచి సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. విద్యార్థులు కష్టపడి పనిచేస్తే ఆహ్లాదకరమైన ఫలితాలు అందుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ప్రయోజనం అందుకుంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఉంటే వాటి అధిగమించి పూర్తిచేస్తారు. వ్యాపారంలో ప్రణాళికబద్ధంగా ఉండటం వల్ల ప్రయోజనం అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.