ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 1 అక్టోబర్ 2020

By Arun Kumar P  |  First Published Oct 1, 2020, 7:19 AM IST

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి... 
 


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

Latest Videos

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మీకు శుభకరంగా ఉంటుంది. మీ అభినందనల కారణంగా మీ సహచరుల్లో కొందరు కలత చెందే అవకాశముంది. అయితే మీ ప్రవర్తనతో మీరు వారిని మంచి చేసుకుంటారు. దానాలు చేస్తూ సమయాన్ని గడుపుతారు. మీరు ఎంచుకున్న రంగంలో మంచి అవకాశాలు పొందుతారు. మీపై అధికారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు కుటుంబంతో కలిసి సంతోషంగా ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తల వహించండి. ఎలాంటి కారణం లేకుండా ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశముంది. సాయంత్రం సమయంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న అతిథి రాక ఆనందంగా ఉంటుంది. శుభకరమైన పనిలో చేరడం ద్వారా మీ గౌరవం పెరుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు గొప్ప వ్యక్తుల ఫిలాసఫి మీలో ధైర్యాన్ని పెంచుతుంది. భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఉన్నతాధికారులతో సాయంతో విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తారు.  ఈ రోజు మీరు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఎలాంటి కారణం లేకుండా ఖర్చులను నియంత్రించుకోవాలి. సాయంత్రం సమయానికి వేగంగా కదిలే వాహనాలతో జాగ్రత్త వహించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. రాష్ట్ర విలువుల ఖ్యాతిని పెంచుతాయి. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాల వల్ల పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. మీకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరు శుభంగా ఉంటుంది. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవడం వల్ల మనస్సు ఆనందంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగ పరుచుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు మీ మనస్సు సంతోషంగా ఉంటారు. పోటీరంగంలో ముందుకు సాగుతుంది. నిలిచిపోయిన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. జీర్ణక్రియ నెమ్మదిగా ఉండవచ్చు. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. గ్రహాల స్థానాల వల్ల మీరు రాజకీయ రంగంలో మీరు విజయం సాధిస్తారు. సహచరుల నుంచి మద్దతు పొందుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. డబ్బు వచ్చినపుడు మీరు కూడా సంతోషంగా ఉంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు వీలైనంతవరకు వివాదాలు, తగాదులకు దూరంగా ఉండండి. గొడవైతే కొంచెం ఓపిక పట్టండి. ఇంట్లో సమస్యలు పరిష్కారమవుతాయి. సూర్యస్తమయం తర్వాత ఆకస్మిక ప్రయోజనాలు పొందే అవకాశముంది. మీకు జీవనోపాధి రంగంలో ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తారు. మనస్సులో ఆనందం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. దేశ పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు విద్యా పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నూతన ఆదాయ మార్గాలను లభిస్తాయి. మీ మాట చాతుర్యంతో ప్రత్యేక గౌరవం పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ఆగిపోయిన పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మీ మాటలతో సంయమనం పాటించడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. మీ కోపంతో బాధపడవచ్చు. మీరు గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి షాపింక్ చేస్తారు. ప్రాపంచీక ఆనందాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఫలితంగా సంపద, గౌరవం, కీర్తి పెరుగుతాయి. మీకిష్టమైన వారితో సరదాగా గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధించగలుగుతారు. మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు విఫలమవుతాయి. ఇంటికి అవసరమైన వస్తువులను పొందుతారు. సహచరులు లేదా ఉద్యోగుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భార్య ఆరోగ్యానికి అకస్మాత్తుగా నష్టం జరగవచ్చు. అనారోగ్య పరిస్థితులు కారణంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఆస్తిని కొనడం లేదా అమ్మకంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. వాహన వైఫల్యం కారణంగా ఖర్చు పెరుగుతుంది. వాణిజ్య పరంగా ఉపశమనం లభిస్తుంది. మనసుకు అనుకూలమైన ప్రయోజనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపార ప్రణాళిక అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల సహాయంతో మీరు ప్రయోజనాలు అందుకుంటారు. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా ఆనందం లభిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

click me!