
మేష రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట బయట అంతటా శుభ ఫలితాలనే అందుకుంటారు.వృత్తి వ్యాపారాలకు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలను చేస్తారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలను అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం.
వృషభ రాశి వారు వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురికావాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులకు గురవుతారు. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు ఉంటాయి.
మిథున రాశి వారు నూతన వస్తు, వాహన కొనుగులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ది కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
కర్కాటక రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. శుభవార్తలు వింటారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో వివాదాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు.
కన్య రాశి వారికి ఖర్చులు పెరిగి అవకాశాలున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర. వ్యాపారా లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.
తుల రాశి వారికి అన్ని వైపుల నుంచి మంచే జరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికే పూర్తవుతాయి. వ్యాపారాలు బాగుంటాయి. మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఇబ్బందులు కలిగిస్తాయి.ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.
ధనస్సు రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.నిరుద్యోగులకు అదిరిపోయే సమయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
మకర రాశి వారికి వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగం చేసే చోట అనవసర నిందల పాలవ్వాల్సి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు. ఋణ ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి.
కుంభ రాశి వారు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుంటారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు.
మీన రాశి వారు ఉద్యోగాలలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలు పరిష్కరమవుతాయి. ఆత్మ విశ్వాసంతో మంచి ఫలితాలు అందుకుంటారు.