భారత్ కు మరో బిగ్ షాక్.. మరో స్టార్ ప్లేయర్ IND vs ENG సిరీస్ నుంచి ఔట్.. !

By Mahesh RajamoniFirst Published Feb 9, 2024, 3:22 PM IST
Highlights

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది. రాజ్‌కోట్ టెస్టుకు మరో స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యార్ గాయం కారణంగా దూరం కానున్నాడని సమాచారం. 

India vs England - Shreyas Iyer: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కొనసాగుతోంది. హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ ఓట‌మి చ‌విచూసింది. అయితే, వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో 106 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ ను భార‌త్ చిత్తు చేసింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. వచ్చే వారం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సిరీస్‌లో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. రాజ్‌కోట్‌లో జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. ఇప్పటికే స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, ర‌వీంద్ర జ‌డేజా, కేఎల్ రాహుల్ ఆడ‌తారా లేదా అనేది సందిగ్దం మ‌ధ్య భార‌త్ కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగే మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు దూరం కావ‌చ్చున‌ని స‌మాచారం.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్  వెన్ను, గజ్జ ప్రాంతంలో నొప్పితో బాధ‌ప‌డుతున్నాడ‌నీ, రాబోయే టెస్టుకు అందుబాటులో ఉండ‌టం క‌ష్ట‌మేన‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి పరీక్ష కోసం శ్రేయాస్ ను పంప‌నున్నారు. 30 కంటే ఎక్కువ బంతులు ఆడిన తర్వాత వెన్ను బిగుసుకుపోతుందనీ, ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడుతున్నప్పుడు నడుము నొప్పిగా ఉందని శ్రేయాస్ అయ్యర్ భారత జట్టు మేనేజ్‌మెంట్, వైద్య సిబ్బందికి తెలియజేసినట్లు నివేదిక పేర్కొంది. సర్జరీ తర్వాత తొలిసారిగా ఆయన ఈ సమస్యను ఎదుర్కొంటున్నారనీ, అందుకే కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పిన‌ట్టు నివేదిక పేర్కొంది.

హెలికాప్ట‌ర్ షాట్స్ మోత.. ! ఐపీఎల్ కోసం ధోని మొదలు పెట్టాడు.. !

ఈ నేప‌థ్యంలోనే బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి వైద్య‌ పరీక్షల‌ కోసం శ్రేయాస్ వెళ్ల‌నున్నాడు. హైదరాబాద్, వైజాగ్‌లలో ఆడిన తొలి రెండు టెస్టుల్లో అయ్యర్ 35, 13, 27, 29 స్కోర్లు నమోదు చేశాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు భారత జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్‌ను తప్పించినట్లయితే, అతని స్థానంలో ఎంపికపై సెలక్టర్లు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. స్వల్ప విరామంలో ఉన్న టీమ్ ఇండియా ఫిబ్రవరి 11న రాజ్‌కోట్‌కు చేరుకుని మరుసటి రోజు నుంచి శిక్షణ ప్రారంభించే అవకాశం ఉంది.

అందులో నిజం లేదు.. విరాట్ కోహ్లీకి క్షమాప‌ణ‌లు చెప్పిన ఏబీ డివిలియర్స్.. ! ఎంత‌ప‌ని చేశావు బాసు.. !

click me!