ధావన్ మిస్ ఫీల్డ్: బతికిపోయిన ఖవాజా

By Siva KodatiFirst Published Mar 8, 2019, 3:27 PM IST
Highlights

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా అత్యంత పేలవంగా ఫీల్డింగ్ చేస్తోంది. సులభమైన క్యాచ్‌లను సైతం మనోళ్లు నేలపాలు చేస్తూ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ప్రాణదానం చేస్తున్నారు. 

జడేజా వేసిన ఏడో ఓవర్‌ నాల్గో బంతిని ఖవాజా రివర్స్ స్వీప్ ఆడగా అది బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న ధావన్ చేతుల్లో పడింది. అయితే సులువైన క్యాచ్‌ను ధావన్ వదిలేయడంతో ఖవాజాకు ప్రాణదానం లభించినట్లయ్యింది.

అంతకు ముందు బుమ్రా వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతి ఎడ్జ్ తీసుకుని బౌండరీ లైన్ తాకింది. ఆ సమయంలో స్లిప్స్‌లో ఫీల్డర్లు లేకపోవడం గమనార్హం. దీంతో ఆసీస్ ఓపెనర్లు భారత్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 164 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ 80, ఉస్మాన్ ఖవాజా 77 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
click me!