డ్రెస్సింగ్ రూమ్‌ వైపు సైగలు... స్మిత్ డీఆర్ఎస్ వివాదానికి రెండేళ్లు

Siva Kodati |  
Published : Mar 07, 2019, 04:12 PM IST
డ్రెస్సింగ్ రూమ్‌ వైపు సైగలు... స్మిత్ డీఆర్ఎస్ వివాదానికి రెండేళ్లు

సారాంశం

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ వివాదానికి రెండేళ్లు గడిచిపోయాయి. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2017 మార్చి 4న ఆసీస్, భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ ఆరంభమైంది. 

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ వివాదానికి రెండేళ్లు గడిచిపోయాయి. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2017 మార్చి 4న ఆసీస్, భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ ఆరంభమైంది.

మార్చి 7వ తేదీన ఉమేశ్ బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీగా దొరికిపోయాడు. దీనిని ఫీల్డ్ అంపైర్ నైజెల్ లాంగ్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై స్మిత్ డీఆర్ఎస్‌కు వెళ్లాలని భావించాడు.

దీనిపై స్మిత్ ముందుగా సహచరుడు హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించాడు. అప్పటికీ అనుమానం తీరకపోవడంతో ఏం చేద్దాం అన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు చేతులతో సైగ చేశాడు. దీనిని గుర్తించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెంటనే అక్కడికి వచ్చి అలా చేస్తావంటూ స్మిత్‌తో వాగ్వాదానికి దిగాడు.

దీంతో అంపైర్లు ఇద్దరిని పక్కకు తీసుకెళ్లారు.  ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాడు డీఆర్ఎస్ విషయంలో మైదానంలో ఉన్న వారితో తప్పించి బయటివారి సహాయం తీసుకోరాదు. దీంతో స్మిత్ రివ్యూ కోరకుండానే నిష్క్రమించాడు.

స్మిత్ వ్యవహారశైలిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. స్మిత్‌ను కోహ్లీ మోసగాడంటూ విమర్శించాడు.... దీనిని కప్పిపుచ్చుకునేందుకు స్మిత్ నానా అవస్థలు పడ్డాడు. ఒత్తిడిలో ఉన్న తనకు ఆ సమయంలో బుర్ర పనిచేయకే అలా చేశానంటూ వివరణ ఇచ్చాడు.

అయినప్పటికీ క్రికెట్ ప్రపంచం స్టీవ్ స్మిత్‌ను తప్పుబట్టింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయానికి 188 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు అలౌటైంది.

దీంతో భారత్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టెస్టు డ్రాగా ముగియగా, నాలుగో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర