చివరి ఓవర్ వేస్తున్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ ఒత్తిడి...: విజయ్ శంకర్ (వీడియో)

Published : Mar 06, 2019, 11:31 AM IST
చివరి ఓవర్ వేస్తున్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ ఒత్తిడి...: విజయ్ శంకర్ (వీడియో)

సారాంశం

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా మహారాష్ట్ర నాగ్ పూర్ లో రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా చివరి ఓవర్లో విజయాన్ని కైవసం చేసుకుంది.  ఇలా చివరి ఓవర్లో ఆసిస్ బ్యాట్ మెన్స్ ను బోల్తా కొట్టించి రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విజయ్ శంకర్ అభిమానుల దృష్టిలో హీరోగా మారిపోయాడు. 

అయితే మ్యాచ్ అనంతరం కోహ్లీ, విజయ్ శంకర్ ను కలిపి చాహల్ టీవి కోసం యజువేందర్ చాహల్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా చాహల్ అడిగిన ఓ ప్రశ్నకు శంకర్ ఇచ్చిన సరదా సమాధానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఉత్కంఠ మ్యాచ్ లో చివరి ఓవర్ వేస్తున్నప్పటికి కంటే ఎక్కువ ఒత్తిడిని ప్రస్తుతం హిందీలో మాట్లాడటానికి గురవుతున్నానంటూ విజయ్ సమాధానమిచ్చాడు.

ఈ వీడియోను బిసిసిఐ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఈ వీడియోపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ షేర్ చేస్తుండటంతో వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరూ చూడండి. 

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర