బిసిసిఐ‌కి కౌంటరివ్వడానికి సిద్దమవుతున్న పిసిబి....ఐసిసి సమక్షంలోనే

By Arun Kumar PFirst Published Feb 27, 2019, 3:29 PM IST
Highlights

పుల్వామా ఉగ్రవాది నేపథ్యంలో క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. తాజాగా పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి భారత వైమానిక దళ విమానాలు ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులకు తెగబడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో క్రికెట్ సంబంధాలు కూడా మరింత దిగజారాయి. 

ప్రపంచ కప్ లో భారత్-పాక్ వివాదంపై శుక్ర లేదా శనివారాల్లో జరిగే ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ త్రైమాసిక సమావేశంలో చర్చించనున్నట్లు ఐసిసి తెలిపింది. ఈ విషయంపై బిసిసిఐ, పిసిబి అధికారులతో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఐసిసి అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో తమతో మ్యాచ్ ఆడకూడదని భావిస్తున్న భారత్ పై చర్యలు తీసుకోవాలని పిసిబి డిమాండ్ చేయనున్నట్లు సమాచారం. 

మైదానంలో జరిగిన ఓ చిన్న తప్పు కారణంగా తమ జట్టు కెప్టెన్ సర్పరాజ్‌ఖాన్‌పై నాలుగే వన్డేల నిషేధాన్ని విధించడాన్ని పిసిబి ఐసిసి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. తమ ఆటగాడి పట్ల ఎంత కఠినంగా వ్యవహరించారో....తమతో మ్యాచ్ ఆడకుంటే భారత్ పై కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని పిసిబి కోరనున్నట్లు సమాచారం. అలాగే లీగ్ దశలో తమతో ఆడకుండా నిషేధించినా నాకౌట్  లో తలపడాల్సిన వస్తే భారత్ అప్పుడేం చేస్తుందో కూడా తెలుసుకోవాలని ఐసిసిని కోరనున్నట్లు పిసిబికి చెందిన ఓ అధికారి తెలిపారు.   
 
click me!