భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు 2,300 పోలీసులతో భారీ బందోబస్తు: కమీషనర్

By Arun Kumar PFirst Published Feb 27, 2019, 2:03 PM IST
Highlights

భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో రెండు టీ20, ఐదు వన్డేల్లో తలపడనుంది. ఇవాళ బెంగళూరులో జరిగే మ్యాచ్ తో టీ20 సీరిస్ ముగియనుండగా మార్చి 2 నుండి  వన్డే సీరిస్ ప్రారంభంకానుంది. ఈ సీరిస్ ఆరంభ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. 
 

భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో రెండు టీ20, ఐదు వన్డేల్లో తలపడనుంది. ఇవాళ బెంగళూరులో జరిగే మ్యాచ్ తో టీ20 సీరిస్ ముగియనుండగా మార్చి 2 నుండి  వన్డే సీరిస్ ప్రారంభంకానుంది. ఈ సీరిస్ ఆరంభ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. 

ఈ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద బారీ బందోబస్తును ఏర్పాటుచేయనున్నట్లు సైబరాబాద్ కమీషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. భారత్-ఆసిస్ కు చెందిన ఆటగాళ్లకు పటిష్ట భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి  వచ్చే అభిమానులు రక్షణ చర్యల్లో పోలీసులకు సహకరించాలని కమీషనర్ సూచించారు.

మరో మూడు రోజుల్లో ఉప్పల్ స్టేడియంలో  జరగనున్న అంతర్జాతీయ వన్డే కోసం చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లపై కమీషన్ మీడియాతో మాట్లాడారు. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో దాదాపు 200 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అలాగే ఆటగాళ్ల భద్రతను దృష్టిలో వుంచుకుని కొన్ని వస్తువులను అభిమానులు స్టేడియంలోకి తీసుకెళ్లకుండా నిషేదం విధించినట్లు వెల్లడించారు. ఫైర్ సిబ్బంది సేవలను కూడా ఉపయోగించుకోనున్నట్లు...అత్యవసర సేవల కోసం ఐదు ఫైరింజన్లు మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియం వద్ద అందుబాటులో వుంటాయని కమీషనర్ తెలిపారు. 

వన్డే మ్యాచ్ మద్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమై రాత్రి కూడా కొనసాగనుంది. దీంతో అభిమానుల సౌకర్యార్థం మెట్రో సేవలను అర్థరాత్రి వరకు కొనసాగించాలని  మెట్రో అధికారులను కోరినట్లు తెలిపారు. దీనిపై త్వరలో మెట్రో సంస్థ నుండి క్లారిటీ వస్తుందన్నారు. 
 
ఇక వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని...వికలాంగుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు కమీషనర్ తెలిపారు. సొంత వాహనాల్లో వచ్చే వారు కాస్త ముందుగా వచ్చి కేటాయించిన స్థలంలోనే తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండానే తమ బందోబస్తు కొనసాగుతుందని మహేష్ భగవత్ పేర్కొన్నారు.   
    

click me!