టీమిండియాకు అతడో విలువైన ఆస్తి...ప్రపంచ కప్‌లో కీలకం: నెహ్రా

Published : Mar 05, 2019, 05:38 PM ISTUpdated : Mar 05, 2019, 06:17 PM IST
టీమిండియాకు అతడో విలువైన ఆస్తి...ప్రపంచ కప్‌లో కీలకం: నెహ్రా

సారాంశం

భారత జట్టులో ప్రస్తుతమున్న బౌలర్లలో మహ్మద్ షమీ అత్యుత్తమంగా రాణిస్తున్నాడని వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. ప్రపంచ కప్ కు ముందు అతడు మరింత మెరుగ్గా ఆడుతున్నాడని నెహ్రా గుర్తుచేశారు. ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ బౌలర్ గా రాణించగల సత్తా షమీకి వుందని నెహ్రా జోస్యం చెప్పారు.

మరికొద్దిరోజుల్లో జరగనున్న ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు అత్యుత్తమంగా ఆడుతోందన్నారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగం రాణించడం వల్లే భారత్ ఈ స్థాయి ఆటతీరును కనబరుస్తోందని వివరించారు.  భారత బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్నాడని...ప్రపంచ కప్ జట్టులో అతడు కీలక బౌలర్ గా మారనున్నాడని నెహ్నా అన్నాడు.  

షమీ రూపంలో భారత జట్టు కు ఓ విలువైన ఆటగాడు దొరికాడని కొనియాడాడు. మరీముఖ్యంగా ఈ మధ్య షమీ ఆడిన కొన్ని మ్యాచుల్లో అతడి బౌలింగ్ అద్భుతంగా వుందని...ఎప్పటికప్పుడు తన ఆటతీరులో మార్పులు చేసుకుంటూ బౌలింగ్ ను మెరుగుపర్చుకుంటున్నాడని తెలిపాడు. అతడు పిట్ నెస్ కాపాడుకుంటూ, ఫామ్ ను కొనసాగిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీని సాధించడంలో టీమిండియాలో అతడి పాత్ర తప్పకుండా వుంటుందని నెహ్రా పేర్కొన్నాడు.  

PREV
click me!

Recommended Stories

IPL 2026 : CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 14 కోట్ల ప్లేయర్ ఔట్ !
SRH Dangerous Batsmen : ఇషాన్ నుండి అభిషేక్ వరకు.. IPL 2026 లో టాప్ 5 డేంజర్ బ్యాటర్లు, లిస్ట్ లో ఒకేఒక్క తెలుగోడు