ధోనీపై విమర్శల వెల్లువ: సంజయ్ బంగర్ ఆగ్రహం

By telugu teamFirst Published Jul 2, 2019, 8:28 AM IST
Highlights

జట్టు కోసం ధోనీ పనిచేస్తున్నాడని, ధోనీ బ్యాటింగ్ తీరుపై తాము సంతోషంగా ఉన్నామని సంజయ్ బంగర్ అన్నాడు. అఫ్గానిస్తాన్ పై జరిగిన మ్యాచులో తప్ప ప్రతి మ్యాచులోనూ తన పాత్రను ధోనీ బాగా పోషించాడని చెప్పాడు.

బర్మింగ్ హామ్: మహేంద్ర సింగ్ ధోనీపై వెల్లువెత్తుతున్న విమర్శలపై భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధోనీ స్ట్రైక్ రేట్ పై నిత్యం విమర్శలు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో ధోనీ బ్యాటింగ్ చేసిన తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో ధోనీ 31 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే, గెలవాలనే తపన ధోనీ బ్యాటింగ్ చేసిన తీరులో కనిపించలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచులో భారత్ ఇంగ్లాండుపై 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

జట్టు కోసం ధోనీ పనిచేస్తున్నాడని, ధోనీ బ్యాటింగ్ తీరుపై తాము సంతోషంగా ఉన్నామని సంజయ్ బంగర్ అన్నాడు. అఫ్గానిస్తాన్ పై జరిగిన మ్యాచులో తప్ప ప్రతి మ్యాచులోనూ తన పాత్రను ధోనీ బాగా పోషించాడని చెప్పాడు. అఫ్గనిస్తాన్ పై జరిగిన మ్యాచులో ధోనీ 52 బంతులను ఎదుర్కుని 28 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై సచిన్ టెండూల్కర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కూడా.

క్లిష్ట సమయాల్లో ధోనీ జట్టును ఆదుకున్న సందర్భాలను బంగర్ గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికా జరిగిన మ్యాచులో రోహిత్ తో కలిసి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడని ఆయన చెప్పాడు. ఆస్ట్రేలియాపై ఆడిన ధోనీ ఆటను కూడా ఆయన గుర్తు చేశాడు. 

ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో ధోనీ, కేదార్ జాదవ్ ఆట తీరును ఆయన సమర్థించాడు. ఇంగ్లాండు బౌలర్లు వేసిన బంతులను పరిశీలిస్తే అంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి అని ఆయన అన్నాడు. 

click me!