క్రెడిట్ కూతురికి ఇచ్చేసిన రోహిత్ శర్మ

By telugu teamFirst Published Jun 17, 2019, 10:52 AM IST
Highlights

తన కూతురు సమైరా శర్మ వల్లే తాను రాణిస్తున్నట్లు రోహిత్‌ శర్మ తెలిపాడు. కూతురు పుట్టడంతో తన దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని అన్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు) అ‍ద్భుతమైన సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

మాంచెస్టర్‌: ప్రపంచ కప్ పోటీల్లో తాను చేస్తున్న అద్భుతమైన బ్యాటింగ్ క్రెడిట్ ను టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన కూతురు సమైరా శర్మకు ఇచ్చేశాడు.  దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాపై అర్థ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఆదివారం పాకిస్తాన్ పై జరిగిన మ్యాచులో సెంచరీ చేశాడు.  

తన కూతురు సమైరా శర్మ వల్లే తాను రాణిస్తున్నట్లు రోహిత్‌ శర్మ తెలిపాడు. కూతురు పుట్టడంతో తన దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని అన్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు) అ‍ద్భుతమైన సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

తన జీవితంలో మంచిరోజులు నడుస్తున్నాయని, తనకు కూతురు పుట్టడం.. ఆమె రాకతోనే మంచి రోజులు ప్రారంభమయ్యాయని అన్నాడు. ప్రస్తుతం తాను క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. డబుల్‌ సెంచరీపై ఆలోచన చేయలేదని, చక్కటి ప్రారంభం మీద ఇన్నింగ్స్‌ను నిర్మించామని అన్నాడు. 

జట్టుగా తాము ఆడిన తీరు పట్ల సంతోషంగా ఉన్నామని, తాను ఔటైన తీరుకు అసంతృప్తి చెందానని అన్నాడు. ఆ షాట్‌ ఎంపిక తన నిర్ణయ లోపమేనని, నిలదొక్కుకున్న తర్ావత సాధ్యమైనన్ని పరుగులు చేయాలని రోహిత్ శర్మ అన్నాడు. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మ్యాచ్‌ను తోమ వైపు తిప్పుకోవాలని అనుకుంటున్న సమయంలో ఔట్ కావడం సరైంది కాదని అన్నాడు. 

డబుల్‌ సెంచరీ గురించి తాను ఆలోచించలేదని, రాహుల్‌ చాలా బాగా ఆడాని,. అతడు సమయం తీసుకున్నా నేరుగా షాట్లు ఆడలేని పరిస్థితిలో అది అవసరమేనని అన్నాడు. తాను నిరుడు డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో రోహిత్ శర్మకు సమైరా శర్మ పుట్టిన సంగతి తెలిసిందే. 

click me!