ఇండియాపై మ్యాచ్: ప్రధాని మాట కూడా వినని పాక్ కెప్టెన్

By telugu teamFirst Published Jun 16, 2019, 8:23 PM IST
Highlights

తమ జట్టు టాస్ గెలిస్తే ఇండియాపై బ్యాటింగ్ ఎంచుకోవాలని ఇమ్రాన్ ఖాన్ సర్ఫరాజ్ కు సూచించాడు. తుది జట్టులోకి ఎవరెవరిని తీసుకోవాలో కూడా సూచించారు. 

ఇస్లామాబాద్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇండియాపై జరుగుతున్న మ్యాచ్ విషయంలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ తమ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటను పెడచెవిన పెట్టారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ తన దేశానికి 1992లో ప్రపంచ కప్ ను అందించాడు. 

తమ జట్టు టాస్ గెలిస్తే ఇండియాపై బ్యాటింగ్ ఎంచుకోవాలని ఇమ్రాన్ ఖాన్ సర్ఫరాజ్ కు సూచించాడు. తుది జట్టులోకి ఎవరెవరిని తీసుకోవాలో కూడా సూచించారు. పట్టాలపై రైలు వెళ్తున్నప్పుడు పట్టాలు ఒత్తిడి భరించినట్లుగా మ్యాచులో ఒత్తిడిని అధిగమించి ఆడే బ్యాట్స్ మెన్ ను, బౌలర్లను తుది జట్టులోకి తీసుకోవాలని చెప్పారు. 

అయితే, ఇమ్రాన్ ఖాన్ సలహాలను సర్ఫరాజ్ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. టాస్ గెలిచినప్పటికీ సర్ఫరాజ్ ఇండియాపై ఫీల్డింగ్ నే ఎంచుకున్నాడు. ఇండియాపై విజయం సాధిస్తే సర్ఫరాజ్ ప్రశంసలు అందుకోవచ్చు గానీ ఓడిపోతే మాత్రం తీవ్రమైన విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. అనుభవజ్ఞుడైన ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచనను పాటించకపోవడం వల్లే ఓటమి పాలైందనే విమర్శలు రావచ్చు. 

click me!