గ్రౌండంతా భారతీయులే, జాడలేని ఆసీస్ అభిమానులు

Siva Kodati |  
Published : Jun 10, 2019, 10:43 AM ISTUpdated : Jun 10, 2019, 10:51 AM IST
గ్రౌండంతా భారతీయులే, జాడలేని ఆసీస్ అభిమానులు

సారాంశం

ఆదివారం జరిగిన ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌కు భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్లి సందడి చేయగా.. ఆస్ట్రేలియా అభిమానులు ఎక్కడా కనిపించకపోవడంతో మైదానమంతా మువ్వన్నెల జెండా రెపరెపలతో నిండిపోయింది. 

ప్రపంచ్‌కప్ టైటిల్ ఫేవరేట్లైన భారత్, ఆస్ట్రేలియాలు ఢీకొట్టుకుంటుంటూ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. మామూలుగానే భారత్‌లో క్రికెట్ ఒక మతం.. ప్రపంచంలోనే ఏ మూల మ్యాచ్ ఉన్న భారత అభిమానులు అక్కడ వాలిపోయి జట్టును ఉత్సహపరుస్తూ ఉంటారు.

అచ్చం మన దేశంలాగేనే ఆస్ట్రేలియా ప్రజలు కూడా క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతారు. ఆ దేశ అధికారిక క్రీడ కూడా క్రికెటే. ఆదివారం జరిగిన ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌కు భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్లి సందడి చేయగా.. ఆస్ట్రేలియా అభిమానులు ఎక్కడా కనిపించకపోవడంతో మైదానమంతా మువ్వన్నెల జెండా రెపరెపలతో నిండిపోయింది.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ట్వీట్ చేశారు. మైదానమంతా వెతికినా క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిపి ఆసీస్ మద్ధతుదారులు 33 మందికి మించిలేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దీనిని గమనించిన భారత అభిమానులు..  భారత్ సత్తా అంటే ఇదంటూ కామెంట్ చేయగా.. ఆస్ట్రేలియాకు క్రికెట్ ఒక్కటే కాదు.. అన్ని క్రీడులున్నాయంటూ ఆ దేశ అభిమానులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఓవర్‌ త్రో.. ఆశలు సమాధి: ఈ పరిస్ధితి ఎవరికీ రావొద్దన్న విలియమ్సన్
మా చెత్త ఆట వల్లనే ఓటమి: రోహిత్ శర్మ తీవ్ర ఆవేదన