సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

By telugu teamFirst Published Jun 9, 2019, 7:35 PM IST
Highlights

ఆసీస్‌పై 37 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్‌ శర్మ రెండు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్‌పై అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఆ మార్కును చేరిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. 

లండన్‌: భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగుల మార్కును చేరిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును అతను బ్రేక్‌ చేశాడు. 

ఆసీస్‌పై 37 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్‌ శర్మ రెండు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్‌పై అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఆ మార్కును చేరిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. వన్డేల్లో ఆసీస్‌పై రెండు వేల పరుగులు చేయడానికి సచిన్‌కు 40 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, దాన్ని రోహిత్‌ తాజాగా సవరించాడు. 

ఆసీస్‌పై తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగుల పూర్తి చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ, సచిన్‌లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, వెస్టింజీస్ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

ఒక జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల వన్డే పరుగులను పూర్తి చేసుకున్న ఆటగాళ్లలో జాబితాలో కూడా రోహిత్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఒక జట్టుపై రెండు వేల పరుగుల్ని వేగవంతంగా సాధించిన ఆటగాళ్లలో రిచర్డ్స్‌తో కలిసి కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. 

అయితే,  కోహ్లి ఘనత శ్రీలంకపై ఉంది. శ్రీలంకపై రెండు వేల వన్డే పరుగులు చేయడానికి కోహ్లికి 44 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కాగా, వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆసీస్‌తో తాజా మ్యాచ్‌లో రోహిత్‌ (57) అర్థ సెంచరీ చేశాడు. ధావన్‌తో కలిసి  127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్యాచులో రోహిత్‌ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు.

click me!