నా సహచరుడు తిరిగొచ్చాడు: వార్నర్‌పై ఫించ్ ప్రశంసల వర్షం

By Siva KodatiFirst Published Jun 10, 2019, 1:07 PM IST
Highlights

ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్ అద్భుత సెంచరీకి తోడు కోహ్లీ, రోహిత్, పాండ్యా, ధోనీల ధనాధన్ బ్యాటింగ్ కారణంగా భారత్.. ఆసీస్ ముందు 352 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

అయితే ఛేదనలో భాగంగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టేలా ఆడాడు. అయితే అతను తన సహజశైలికి భిన్నంగా  84 బంతుల్లో అర్థసెంచరీ చేయడంపై ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ స్పందించాడు.

మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఫించ్ చాలా కాలం తర్వాత తన సహచరుడితో ఆడటం పట్ల సంతోషంగా ఉందన్నారు. భారత్‌తో మ్యాచ్ ద్వారా వార్నర్ తిరిగి గాడిలో పడటం ఆసీస్‌కు శుభపరిణామమన్నాడు.

నిస్సారమైన పిచ్‌పై కూడా వార్నర్.. భారత బౌలర్లను ఎదుర్కొని బాగా ఆడాడన్నాడు. అతను చాలా గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని ఫించ్ ప్రశంసించాడు. భారత ఆటగాళ్లు అన్ని రంగాల్లో మెరుగ్గా ఉన్నారని.. ముందుగా బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లతో అద్భుత ప్రదర్శన చేశారన ఆసీస్ కెప్టెన్ కొనియాడాడు. తొలుత టాస్ ఓడిపోవడం కూడా తమకు మైనస్‌గా మారిందన్నాడు. 

click me!