టీమిండియా మరో షాక్... ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డ కీలక ఆల్ రౌండర్

By Arun Kumar PFirst Published Jun 20, 2019, 4:04 PM IST
Highlights

టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటివరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్టును ఈ గాయాలు ప్రభావితం  చేస్తాయేమోనన్న ఆందోళన జట్టులోనే కాదు అభిమానుల్లోనూ మొదలయ్యింది. తాజాగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో యువ ఆలౌరౌండర్  విజయ్ శంకర్ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 

భారత స్టార్ బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రిత్ సింగ్ బుమ్రా బౌలింగ్ లో శంకర్ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. బుమ్రా యార్కర్ ను అతడు  అంచనావేయలేకపోవడంతో బంతి నేరుగా కాలికి తగిలింది. దీంతో శంకర్ నొప్పితో విలవిల్లాడిపోతూ మైదానాన్ని వీడాడు. 

అయితే శంకర్ గాయంపై  ఎలాంటి  ఆందోళన అవసరం లేదని టీం మేనేజ్ మెంట్ తెలిపింది. అతడి గాయం చాలా చిన్నదేనని... నొప్పి మాత్రమే అధికంగా వుందన్నాడు. నిన్న ఉదయం గాయం కాగా సాయంత్రానికి నొప్పి కూడా తగ్గిపోయిందని తెలిపారు. ముందు జాగ్రత్త  కోసం మాత్రమే అతన్ని డాక్టర్ల పర్యవేక్షణలో వుంచినట్లు వెల్లడించారు. 

ఇప్పటికే ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో బొటనవేలి గాయం  కారణంగా సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇక  పాక్ తో జరిగిన మ్యాచ్ లో తొడకండరాలు పట్టేయడంతో స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా  జట్టుకు దూరమయ్యాడు. ఇలా ఒక్కొక్కరుగా గాయాలపాలై జట్టును వీడుతుండటంతో ఆందోళనలో వున్న టీమిండియాలో విజయ్ గాయం మరింత ఆందోళనను పెంచింది. 

సంబంధిత వార్తలు

2019 వరల్డ్ కప్ లో భారత్ తలపడే మ్యాచుల షెడ్యూల్  

click me!