కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం...అయినా టిమిండియా సెమీస్ కు: గంగూలీ

By Arun Kumar PFirst Published Jun 20, 2019, 3:33 PM IST
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను ఆటగాళ్ల గాయాలు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్, ఓపెనర్ శిఖర్ ధవన్ గాయం కారణంగా ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా పాక్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడి జట్టుకు దూరమవ్వాల్సి వస్తోంది. ఇలా ఒక్కొక్కరుగా కీలక  ఆటగాళ్లు గాయాలబారిన పడుతుండటంతో ఆందోళనకు గురవుతున్న  టీమిండియాకు మాజీ సారథి సౌరవ్ గంగూలీ దైర్యాన్ని నూరిపోశాడు. ఎవరు  ఆడినా ఆడకపోయినా టీమిండియా సెమీస్ కు చేరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 

ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచులను గమనిస్తే టీమిండియానే అత్యంత పటిష్టంగా వున్నట్లు స్పష్టమవుతోంది. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమిష్టిగా రాణించడమే మన జట్టు బలం. కాబట్టి అలాంటి టీం కు ఒకరిద్దరు గాయాలతో దూరమవడం వల్ల జరిగే నష్టమేమీ వుండదని గంగూలీ తెలిపారు.

ఇక ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లోనూ టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. కాబట్టి ఇలా టీమిండియా ఖాతాలోకి ఇప్పటికే7 పాయింట్లు చేరాయి. మిగతా మ్యాచుల్లోనూ ఇదే ఆటతీరును కనబర్చి టీమిండియా తన విజయపరంపరను కొనసాగించి సెమీస్ కు చేరడం ఖాయమని గంగూలీ అన్నారు. 

''శిఖర్ ధవన్ ఆడకున్నా పాకిస్థాన్ ను టీమిండియా మట్టికరిపించింది.  ఇదొక్క విజయం చాలు భారత జట్టు ఫామ్ లోనే వుందని,  ఆటగాళ్ల గాయాలు విజయాన్ని అడ్డుకోలేవని చెప్పడానికి. కానీ ఇలా కీలక ఆటగాళ్లు లేని ప్రభావం మాత్రం జట్టులో కనిపిస్తుంది. అయితే ఈ గాయాలను మనం నియంత్రించలేం కదా'' అని గంగూలి అభిప్రాయపడ్డారు.   

click me!