‘నువ్వు ఓ లెజెండ్‌వి నేస్తమా...’ రిటైర్మెంట్ ప్రకటించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌ పోస్టుపై...

By Chinthakindhi RamuFirst Published Sep 13, 2021, 10:43 AM IST
Highlights

2015 వన్డే వరల్డ్‌కప్‌లో జింబాబ్వేకి కెప్టెన్‌గా వ్యవహరించిన బ్రెండన్ టేలర్... 17 ఏళ్ల కెరీర్‌లో జింబాబ్వే తరుపున అద్భుతమైన రికార్డు క్రియేట్ చేసి... 

జింబాబ్వే క్రికెటర్, మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో జింబాబ్వేకి కెప్టెన్‌గా వ్యవహరించిన టేలర్, వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మొట్టమొదటి జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

2015 వన్డే వరల్డ్‌కప్‌లో 433 పరుగులు చేసిన బ్రెండన్ టేలర్, వన్డేల్లో 11 సెంచరీలతో జింబాబ్వే తరుపున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ నిలిచాడు. తన కెరీర్‌లో 34 టెస్టులు, 202 వన్డేలు, 45 టీ20 మ్యాచులు ఆడిన బ్రెండన్ టేలర్... మొత్తంగా 9 వేలకు పైగా పరుగులు చేశాడు.

Forever grateful for the journey. Thank you 🙏 pic.twitter.com/tOsYzoE5eH

— Brendan Taylor (@BrendanTaylor86)

ఇందులో వన్డేల్లో 11 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలతో పాటు ఓవరాల్‌గా 57 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది జింబాబ్వే. రేపు జరిగే మూడో టీ20 మ్యాచ్ తనకి ఆఖరి మ్యాచ్ అంటూ ప్రకటించిన బ్రెండన్ టేలర్, 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో తనకు తోడుగా నిలిచిన అభిమానులకు, సహచర క్రికెటర్లకు ధన్యవాదాలు తెలిపాడు...

బ్రెండన్ టేలర్ రిటైర్మెంట్ పోస్టుపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ స్పందించాడు... ‘నువ్వో లెజెండ్‌వి మై ఫ్రెండ్... ఫీల్డ్‌లో, ఫీల్డ్ బయట నీ కెరీర్ చాలా గొప్పగా సాగింది...’ అంటూ కామెంట్ చేశాడు...

భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా... ‘సక్సెస్‌ఫుల్ కెరీర్‌ కొనసాగించినందుకు కంగ్రాట్స్ బ్రెండన్... నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా’ అంటూ కామెంట్ చేశాడు. 

click me!