వారం రోజుల్లో ఐపీఎల్ 2021 ఫేజ్ 2... ఆ సర్టిఫికెట్ ఉన్న ఫ్యాన్స్‌కి మాత్రమే అనుమతి...

By Chinthakindhi RamuFirst Published Sep 12, 2021, 6:24 PM IST
Highlights

ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ 2020 నిర్వహణ... వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ఫ్యాన్స్‌కి ఐపీఎల్ 2021 చూసే అవకాశం ...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 సీజన్‌కి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు కరోనా కారణంగా రద్దు కావడంతో ఇప్పటికే యూఏఈ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు... క్వారంటైన్ పీరియడ్‌లో చేరిపోయారు...

ఆరు రోజుల క్వారంటైన్ తర్వాత మొదటి మ్యాచ్ ఆరంభానికి ముందు జట్లతో కలవనున్నారు ఇరు జట్ల ఆటగాళ్లు. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరిగింది.

అయితే ఈసారి మాత్రం స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ యాజమాన్యం. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్ 1లోనూ ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించలేదు. ఇండియాలో జరిగిన ఐపీఎల్ 2021 మ్యాచులను మూసి ఉంచిన డోర్ల మధ్య  నిర్వహించారు.

ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించారు. అలాగే యూఏఈలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు...

అయితే కరోనా పూర్తి డోస్ పూర్తి డోస్ పూర్తిచేసుకున్నవారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుంది. ఎంట్రీకి ముందు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించిన వారికి లోపలికి అనుమతిస్తారు. ఐపీఎల్ 2021 ఫేజ్ 2 సీజన్‌లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

ఈ ఇరు జట్ల మధ్య ఫేజ్ 1లో జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగి, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. దీంతో యూఏఈలో జరిగే ఆరంభ మ్యాచ్‌కే భారీ క్రేజ్ వచ్చింది...

click me!