Latest Videos

ఐపీఎల్ హిస్ట‌రీలో యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డు

By Mahesh RajamoniFirst Published May 25, 2024, 1:37 PM IST
Highlights

Yuzvendra Chahal : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ బౌల‌ర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2024 లో 15 మ్యాచ్‌లలో 30.33 సగటుతో 18 వికెట్లు తీసుకున్నాడు.  ఈ సీజ‌న్ లో నిరాశపర్చిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలో మ‌రో చెత్త రికార్డును న‌మోదుచేశాడు.  
 

IPL  Yuzvendra Chahal : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 36 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డును త‌న పేరు మీద న‌మోదుచేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో తన బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు ఇచ్చుకున్న బౌల‌ర్ గా నిలిచాడు.

ఐపీఎల్ హిస్ట‌రీలో ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్ అయిన చాహల్.. స్పిన్నర్లకు సహకరించే పిచ్‌పై తన నాలుగు ఓవర్లలో 0/34తో ముగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైద‌రాబాద్ 20 ఓవర్లలో 175/9 స్కోరు చేసింది. స్పీన్న‌ర్ల‌కు అనుకూలించే పిచ్ పై చాహల్ వికెట్లు తీయ‌లేక‌పోయాడు. ఇదే స‌మ‌యంలో త‌న బౌలింగ్ లో మూడు సిక్సర్లు ఇచ్చుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో చాహ‌ల్ బౌలింగ్ లో బాదిన సిక్సర్ల సంఖ్య 224కి చేరుకుంది. దీంతో లెగ్ స్పిన్నర్ - పీయూష్ చావ్లా త‌న బౌలింగ్ లో ఇచ్చిన 222 సిక్సర్ల చెత్త‌ రికార్డును అధిగమించాడు.

IPL 2024: రాజస్థాన్ రాయ‌ల్స్ ఓటమికి ఈ ఐదుగురే కార‌ణం..

తమ బౌలింగ్ లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌల‌ర్ల జాబితాలో చాహ‌ల్ టాప్ లో ఉండ‌గా, ఆ త‌ర్వాత వ‌రుస‌గా పియూష్ చావ్లా, రవీంద్ర జడేజా (206), రవిచంద్రన్ అశ్విన్ (202) లు ఉన్నారు. కాగా, ఐపీఎల్ 2024 లో త‌న బౌలింగ్ లో 30 సిక్స‌ర్లు ఇచ్చుకున్నాడు చాహ‌ల్. ఒక బౌలర్ అందించిన రెండవ అత్యధిక సిక్సర్ల ఇవే. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఇప్ప‌టివ‌ర‌కు బ్యాట‌ర్లు 31 సిక్స‌ర్లు బాదారు. 

ఐపీఎల్ 2024లో యుజ్వేంద్ర చాహల్ ప్ర‌ద‌ర్శ‌న‌..? 

చాహల్ కు ఐపీఎల్ 2024 నిరాశాజనకమైన సీజన్లలో ఒకటిగా మారింది. 15 మ్యాచ్‌ల ఆడిన అత‌ను 18 వికెట్లు మాత్రమే సాధించగలిగాడు. 30.33 సగటు, 19.33 స్ట్రైక్ రేట్‌తో ఈ సీజ‌న్ ను ముగించాడు. 33 ఏళ్ల చాహ‌ల్ ఈ సీజన్‌లో 9.41 ఎకానమీ రేటుతో ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. 9 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో ఐపీఎల్ సీజన్‌ను ముగించడం ఇదే మొదటిసారి. చాహల్ ఐపీఎల్ 2024ను అద్భుతంగా ప్రారంభించాడు. ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే, తర్వాతి 10 మ్యాచ్‌ల్లో అతను ఎనిమిది వికెట్లు మాత్రమే తీయగలిగాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టులో చోటుద‌క్కించుకున్న చాహాల్ పై భారీ అంచ‌నాలే పెట్టుకుంది టీమిండియా.

టీ20 ప్రపంచ కప్ 2024 కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్..

click me!