Latest Videos

IPL 2024: రాజస్థాన్ రాయ‌ల్స్ ఓటమికి ఈ ఐదుగురే కార‌ణం..

By Mahesh RajamoniFirst Published May 25, 2024, 10:05 AM IST
Highlights

SRH vs RR: క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ లో  సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2024 నుంచి ఔట్ అయింది. కీల‌క మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి ముఖ్యంగా ఐదుగురు ప్లేయ‌ర్లు కార‌ణం అయ్యారు.
 

SRH vs RR: ఐపీఎల్ 2024లో ఆరంభం నుంచి విన్నింగ్ ట్రాక్ లో కొన‌సాగిన రాజస్థాన్ ప్రయాణం ఫైనల్‌కు ముందే ముగిసింది. క్వాలిఫ‌య‌ర్ 2 లో హైదరాబాద్ జట్టు చేతిలో 36 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంచిన 176 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించే క్ర‌మంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 139-7 ప‌రుగులు మాత్ర‌మే చేసి 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న రాజస్థాన్ కల మరోసారి చెదిరిపోయింది. ఇప్పుడు ఐపీఎల్ 2024 ఫైన‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)-కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే, కీల‌క‌మైన‌ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి న‌లుగురు ఆటగాళ్ల ప్ర‌ద‌ర్శ‌న కూడా కార‌ణం అయింది.

సంజు శాంసన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పై భారీ ఇన్నింగ్స్ అంచనాలు ఉన్నాయి, కానీ చెప్పుకునే విధంగా ఏమీ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 11 బంతుల్లో 10 పరుగులు చేసి అవుటయ్యాడు. సంజూ శాంసన్ వికెట్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పార్ట్ టైమ్ బౌలర్ అభిషేక్ శర్మ తీయ‌డం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ ఫ్లాప్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ 176 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. ఈ సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల జాబితాలో సంజూ  శాంస‌న్ 531 ప‌రుగుల‌తో టాప్ 5లో ఉన్నాడు కానీ కీల‌క మ్యాచ్ లో చేతులెత్తేశాడు. 

రియాన్ పరాగ్ 

ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్ అతిపెద్ద బలం. ఐపీఎల్ 2024లో రియాన్ పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. క్వాలిఫయర్-2 వంటి ముఖ్యమైన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ నుండి అత్యధిక అంచనాలను పెట్టుకుంది. అలాంటి సమయంలో అతను ఫ్లాప్ షో తో నిరాశ‌ప‌రిచాడు. చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రియాన్ పరాగ్ 10 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యాడు.

రవిచంద్రన్ అశ్విన్ 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ అద్భుత‌మైన బౌలింగ్ వేశాడు. రెండు వికెట్లు తీసుకోవ‌డంతో పాటు ఎకాన‌మీ 5 దాట‌కుండా బౌలింగ్ చేసి జట్టు గెలవడంలో పెద్ద పాత్ర పోషించాడు. అయితే క్వాలిఫైయర్-2 లో అశ్విన్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అశ్విన్ 10.80 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు.

షిమ్రాన్ హెట్మెయర్ - రోవ్‌మాన్ పావెల్

రాజ‌స్థాన్ కు ఫినిష‌న‌ర్లుగా, చివ‌ర‌లో జ‌ట్టు కోసం మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో షిమ్రాన్ హెట్మెయర్,  రోవ్‌మాన్ పావెల్ ఆట కీల‌కం. కానీ, క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ లో వీరిద్ద‌రూ ఆశించిన స్థాయిలో ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. ఇత‌ర ఆట‌గాళ్లు ఔట్ అయిన క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన వీరు మెరుపులు మెరిపించ‌లేక‌పోయారు. చెత్త షాట్ల‌తో క్రీజులోకి అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయారు. షిమ్రాన్ హెట్మెయర్ 4 ప‌రుగులు, రోవ్‌మాన్ పావెల్ 6 ప‌రుగులు మాత్ర‌మే చేశారు.

గ్రౌండ్ లో ఏడ్చేసిన రాజ‌స్థాన్ ఫ్యాన్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు ఫైన‌ల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో రాయల్స్ ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత గ్రౌండ్ లో రాజ‌స్థాన్ క‌న్నీరు పెట్టుకున్న దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

స్టెప్పులేసిన క్యావ్య మార‌న్.. ఏడ్చేసిన ఫ్యాన్స్.. వైర‌ల్ వీడియోలు

click me!