Yuzvendra Chahal's Viral T-Shirt Message: కొంత కాలంగా వినిపించిన పుకార్ల మధ్య భారత స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. అయితే, భార్య ధనశ్రీ వర్మతో విడాకుల విచారణ సమయంలో యుజ్వేంద్ర చాహల్ ధరించిన టీ-షర్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది? ఎందుకో తెలుసా?
Yuzvendra Chahal's Viral T-Shirt Message: యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ కొంతకాలంగా నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం వీరు విడాకులు తీసుకోవడం. గత కొంత కాలంగా ఈ స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇద్దరు దీనిపై బహిరంగంగా మాట్లాడలేదు కానీ, వీరు చేసే పోస్టులు దీనిని కన్ఫార్మ్ చేశాయి. తాజాగా వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది.
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మలు గురువారం ఉదయం బొంబాయి ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. అయితే, కోర్టు విచారణ సందర్భంగా చాహల్ చేసిన ఓ పని అందరి దృష్టిని ఆకర్షించింది. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన లాయర్‌తో కలిసి బొంబాయి ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యాడు. అభిమానుల కంట పడకుండా ఉండేందుకు హూడీ, ఫేస్ మాస్క్ ధరించాడు. కానీ, అతను ధరించిన టీషర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
విడాకుల సందర్భంగా చాహల్ కోర్టుకు వచ్చారు. అతని ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా అతను ధరించిన టీషర్ట్ హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ప్రాంగణం నుంచి బయటకు రాగానే చాహల్ తన హూడీని తీసి బ్లాక్ టీషర్ట్‌ను చూపించాడు. ఆ టీ-షర్ట్‌పై ఉన్న కొటేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై ''Be your own sugar daddy'' అని రాసి ఉంది. అంటే "మీకు మీరే షుగర్ డాడీ అవ్వండి" అని దాని అర్థం.
దీంతో చాహల్ టీషర్ట్ సందేశం ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు అభిమానులు దీన్ని చాలా ఫన్నీగా భావించి, ఈ టీషర్ట్‌పై ఫన్నీ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఓ యూజర్ చాహల్ టీషర్ట్ చూపిస్తున్న వీడియోకు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ''రూ. 4.75 కోట్లు చెల్లించిన తర్వాత యుజ్వేంద్ర చాహల్ టీ-షర్ట్ ఎంపిక'' ఇదని పేర్కొన్నాడు. అలాగే, కొంతమంది అభిమానులు ఆ కొటేషన్‌ను అతని మాజీ భార్య ధనశ్రీ వర్మకు కౌంటర్ అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ కరోనా సమయంలో సోషల్ మీడియాలో కలిశారు. చాహల్ ధనశ్రీ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాడు. నెమ్మదిగా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకున్నారు. కారణాలు ఇంకా తెలియలేదు. చాహల్ ధనశ్రీకి భరణం రూపంలో రూ. 4.75 కోట్లు ఇచ్చాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి.