చాహ‌ల్ స్పిన్ మాయ‌.. కోపంతో రిగిలిపోయిన రిషబ్ పంత్ ఏం చేశాడో తెలుసా?

By Mahesh Rajamoni  |  First Published Mar 29, 2024, 8:41 AM IST

RR vs DC : రాజస్థాన్ రాయ‌ల్స్ తో జరిగిన తన రెండో మ్యాచ్ లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే అవ‌కాశం ల‌భించినా రిష‌బ్ పంత్ దానిని స‌ద్వినియోగం చేయ‌లేక‌పోయాడు. 
 


Rishabh Pant frustration : ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. బౌలింగ్ చేస్తున్నప్పుడు డెత్ ఓవర్లు, ఛేజింగ్ స‌మ‌యంలో  మిడిల్ ఓవర్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ను దెబ్బ‌కొట్టాయి. వ‌రుస‌గా రెండో ఓట‌మి కావ‌డంతో కెప్టెన్ రిషబ్ పంత్ చాలా నిరాశ‌తో క‌నిపించాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఆరంభం గొప్ప‌గా ల‌భించ‌లేదు కానీ, మిలిలార్డ‌ర్ లో యంగ్ ప్లేయ‌ర్ రియాన్ ప‌రాగ్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 185 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్ లో 84 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన రియ‌న్ ప‌రాగ్ స్టార్ గా నిలిచాడు.

ఇక ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ మంచి ఆరంభాన్ని అందించారు. అయితే, విరిద్ద‌రూ ఔట్ అయిన త‌ర్వాత వ‌చ్చిన ఆటగాళ్లు పెద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోయారు. కెప్టెన్ రిష‌బ్ పంత్ కు కూడా జ‌ట్టుకు గెలుపు ఇన్నింగ్స్ ను అందించే అవ‌కాశం ల‌భించింది. కానీ దానిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. అయితే, భారీ షాట్ ఆడ‌బోయే యుజ్వేంద్ర చాహ‌ల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 26 బంతుల్లో 28 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే, త‌న ఔట్ కావ‌డంపై స‌హ‌నం కోల్పోయిన రిషబ్ పంత్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. నిరాశ‌తో గ్రౌండ్ ను వీడిన పంత్.. క్రీజును వీడిన త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్న స‌మ‌యంలో అక్క‌డి గోడ‌ల‌కు త‌న బ్యాట్ తో కోట్టాడు. ఈ ఘ‌ట‌న పంత్ నిరాశ‌ను, ఆగ్ర‌హాన్ని తెలియ‌జేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

Latest Videos

 

pic.twitter.com/dBd0ng5Go7

— Sitaraman (@Sitaraman112971)

 

అదే మా కొంప ముంచింది.. వ‌రుస‌గా రెండో ఓట‌మితో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కు కోప‌మొచ్చింది !

click me!