
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను దానిలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా.. ఆయన లైగర్ తో పోటీ పడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో యువీ, అతని స్నేహితులు కలిసి లైగర్‌తో టగ్ ఆఫ్ వార్ పోటీలో పాల్గొంటారు. దుబాయ్‌లోని ఫేమ్ పార్క్‌లో జరిగిన ఈ సరదా పోటీకి సంబంధించిన వీడియోను యువీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. Tiger vs Liger అనే క్యాప్షన్ జోడించి, తుది ఫలితం ఏంటో మీకు తెలిసే ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
4 నిమిషాల 28 సెకెన్ల పాటు సాగే ఈ వీడియోలో.. యువీ, ఫేమ్ పార్క్‌లోని జంతువులతో సరదాగా గడుపుతూ కనిపించాడు. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకుని.. ఎలుగుబంటి, చింపాంజీలకు ఆహారాన్ని అందించాడు. ఫేమ్ పార్క్‌ను సందర్శించడం ద్వారా జంతువుల పట్ల తనకున్న భయాన్ని అధిగమించగలిగానని, మూగ జీవాలతో దగ్గరగా మెలగడం గొప్ప అనుభూతిని కలిగించిందని యూవీ తెలిపాడు. ఫేమ్ పార్క్ జంతువులకు సురక్షితమైన ప్రదేశమని, ఈ వీడియో తీసే సమయంలో ఏ జంతువుకూ హాని కలిగించలేదని ఆయన పేర్కొన్నాడు.