IPL2021 SRH vs KKR: కోల్‌కత్తా నైట్‌రైడర్స్ అద్భుత విజయం... సన్‌రైజర్స్ మళ్లీ బోల్తా..

By Chinthakindhi RamuFirst Published Oct 3, 2021, 10:59 PM IST
Highlights

ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న కేకేఆర్... శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... ఆఖర్లో దినేశ్ కార్తీక్ మెరుపులతో...

116 పరుగుల టార్గెట్... ఫేజ్ 2లో దూకుడు మీదున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు, ఈ లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఊదేస్తుందని భావించారంతా. అయితే బౌలింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు మంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేకేఆర్‌కి అంత ఈజీగా విజయాన్ని అందించలేదు...

సెకండాఫ్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 14 బంతుల్లో 8 పరుగులు చేసి, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు శుబ్‌మన్ గిల్... 51 బంతుల్లో 10 ఫోర్లతో 57 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత 33 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన నితీశ్ రాణా, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, కీపర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... వస్తూనే బౌండరీతో ఇన్నింగ్స్ మొదలెట్టిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్‌లో 4 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు..

ఆఖరి ఓవర్‌లో విజయానికి 3 పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి సింగిల్ రాగా... మూడో బంతికి మరో సింగిల్ వచ్చింది.  నాలుగో బంతికి బౌండరీ బాదిన దినేశ్ కార్తీక్, లాంఛనాన్ని ముగించాడు... ఈ విజయంతో ప్లేఆఫ్ రేసుకి మరింత చేరువైంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

click me!