రిటైర్డ్: ధోనీని ప్రశంసలతో ముంచెత్తిన యువీ

By telugu teamFirst Published Jun 10, 2019, 2:58 PM IST
Highlights

క్రికెట్ తనకు ఏ విధంగా పోరాడాలో,  ఏ విధంగా పడిపోవాలో, దుమ్ము దులుపుకుని లేచి ముుందుకు ఎలా సాగాలో తనకు నేర్పిందని  యువరాజ్ అన్నారు.

ముంబై: అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న యువరాజ్ సింగ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రశంసించాడు. సోమవారం ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన తన రిటైర్ మెంట్ విషయాన్ని ప్రకటించారు. 22 గజాల లోపల, బయటా, అంతర్జాతీయ క్రికెట్ లో, వెలుపలా ఉన్న తర్వాత 25 ఏళ్ల కు తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. 

క్రికెట్ తనకు ఏ విధంగా పోరాడాలో,  ఏ విధంగా పడిపోవాలో, దుమ్ము దులుపుకుని లేచి ముుందుకు ఎలా సాగాలో తనకు నేర్పిందని  యువరాజ్ అన్నారు. ఇతరులు ఏమనుకుంటారనే విషయాన్ని తాను ఏ రోజు కూడా పట్టించుకోలేదని, తన విశ్వాసంపైనే నమ్మకం పెట్టుకున్నానని అన్నారు. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో తన క్రికెట్ ప్రయాణాన్ని ఎలా మొదలు పెట్టాననే విషయాన్ని కూడా ఆయన వివరించారు. 

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వివియస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలతో ఆడినందుకు గర్వంగా ఉందని అన్నారు. ప్రపంచ కప్ గెలిచిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని ప్రశంసించారు. 28 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన జట్టులో తాను ఉండడం కన్నా మించి గొప్పదేమీ ఉండదని అన్నారు. 

తనకు సంబంధించినంత వరకు అది ఉద్వేగమైన సందర్భమని, అంత కన్నా మంచి సమయం ఏదీ ఉండదని అన్నారు.   

సంబంధిత వార్త

అంతర్జాతీయ క్రికెట్ కు యువరాజ్ గుడ్ బై

click me!