క్రికెటర్ గా నా ప్రస్థానం ముగిసింది...ఇక మిగిలింది అదొక్కటే: యువరాజ్

By Arun Kumar PFirst Published Jun 10, 2019, 4:26 PM IST
Highlights

భారత క్రికెట్ అనేది ఒక సామ్రాజ్యమయితే అందులో కొన్నేళ్లపాటు నిజంగానే యువరాజుగా వ్యవహరించాడు యువరాజ్ సింగ్. ముఖ్యంగా 2011 ప్రపంచ కప్ సమయంలో మహేంద్రసింగ్ (కెప్టెన్) ఓ రాజు మాదిరిగా జట్టును ముందుండి నడిపిస్తుంటే... యువరాజ్ బాధ్యతలన్నీ తనమీదేసుకుని యువరాజ్ లా మారాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ చివరకు ఫీల్డింగ్ లోనూ రాణిస్తూ యువరాజ్ అన్న పేరుకు తగ్గట్లుగానే రాజసంతో కూడిన ఆట ఆడాడు. ఇలా అభిమానుల మనసుల్లో చిరస్థాయిలో నిలిచేలా అత్యుత్తమ క్రికెటర్ గా ఎదిగిన యువరాజ్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 

సోమవారం ముంబయిలో తన రిటైర్మెంట్ ప్రకటన గురించే యువరాజ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశాడు. ఈ సందర్భంగా     అతడు తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ కు, భారత జట్టుకు దూరమవడం గురించి వివరిస్తూ ఉద్వేగానికి  లోనయ్యాడు. కానీ తన  రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయని భావించి  ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించాడు.  

అయితే తాను కేవలం క్రికెట్ కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని యువరాజ్ అన్నాడు. ఇప్పటికే తాను కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నానని...ఇకమీదట ఆ దిశగానే ప్రయాణం కొనసాగిస్తానన్నాడు. క్యాన్సర్ అనేది ఎంత  భయంకరమైన జబ్బో... ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుర్కొంటే అంత తొందరగా నయమయ్యే వ్యాధి అని తెలిపాడు. ఈ విషయం తాను క్యాన్సర్ తో పోరాడి తెలుసుకున్నానని అన్నారు. కాబట్టి ఇకమీదట  క్యాన్సర్ తో బాధపడేవారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆ మహమ్మారి నుండి వారిని కాపాడటమే లక్ష్యమన్నాడు. ఇలా వీలైనంత మేరకు క్యాన్సర్ బాధితులకు సేవ చేయడానికే తన సమయాన్ని కేటాయిస్తానని యువరాజ్ పేర్కొన్నాడు. 

ఇక క్రికెటర్ గా ఎదగాడానికి తనకు సహకరించిన తల్లితదండ్రులకు, మిత్రులకు, సహచర క్రికెటర్లకు యువరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో తన వెన్నంటి నిలబడి ధైర్యాన్నిచ్చిన అభిమానులను తానెప్పటికి మరిచిపోనని అన్నాడు. క్యాన్సర్ బారినపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడున్న సమయంలో వారు తన కోసం ఆ దేవున్ని ప్రార్థించారని...అందువల్లే అంత తొందరగా క్యాన్సర్ ను జయించగలిగానని తెలిపాడు. అభిమానుల  ఆశిస్సులు...క్రికెట్లో నేర్చకున్న పోరాటం, ఒడిదుడుకులను దాటుకుంటూ ముందుకు సాగడమే తనను మళ్లీ ఇలా మీముందు నిలబడేలా చేశాయని యువరాజ్ భావోద్వేగంగా మాట్లాడాడు. 
 
click me!