రిటైర్మెంట్ భావోద్వేగం... తండ్రిని పట్టుకుని ఏడ్చేసిన యువరాజ్ (వీడియో)

By Arun Kumar PFirst Published Jun 10, 2019, 8:00 PM IST
Highlights

టీమిండియా విధ్వంసకర ఆటగాడు యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత క్యాన్సర్ భారిన పడ్డ యువీ... ఎంతో ఆత్మవిశ్వాసంతో దాన్నుండి బయటపడి మళ్లీ తన కెరీర్ ను కొనసాగించాడు. అయితే గతంలో మాదిరిగా రాణించలేక 2017 లో భారత జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుండి జట్టులోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేవు. దీంతో ఇక క్రికెట్ నుండి తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చిన అతడు ఇవాళ అందుకు సంబంధించిన ప్రకటన చేశాడు. 

ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన యువీ మీడియా సభ్యుల ఎదుట తాను అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో టీమిండియాతో తన అనుబంధాన్ని, క్రికెటర్ గా తన ఎదుగుదల ఎలా సాగిందన్న విషయాల గురించి మాట్లాడాడు. 

అయితే తాజాగా యువరాజ్ తన ఫేస్ బుక్ లో ఓ ఉద్వేగభరితమైన వీడియోను పోస్ట్ చేశాడు. క్రికెటర్ గా తన ఎదుగుదల గురించి తల్లిదండ్రులతో మాట్లాడుతూ... చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఈ క్రమంలోనే తండ్రితో కలిసి వాంఖడే స్టేడియం పిచ్ పై కూర్చుని ఏడ్చేశాడు. దీంతో పక్కనే వున్న అతడి తండ్రి యువీని ఓదార్చాడు. యువీ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ రూపొందించిన ఈ వీడియో నెటిజన్ల అమితంగా ఆకట్టుకుంటోంది. 

click me!