
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, తనని ట్రోల్ చేయాలని చూసిన నెటిజన్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. టీమిండియా తరుపున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన రెండో భారత బౌలర్‌గా, మొదటి పేసర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్, ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్‌ను కూడా ఫాలో అవుతున్నాడు ఇర్ఫాన్ పఠాన్. మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. దీనిపై పోస్టు చేసిన ఇర్ఫాన్ పఠాన్... ‘మొదటి టీ20లో టీమిండియా ఓటమికి కారణం ఏంటని అనుకుంటున్నారు? నాకు తెలిసి మన పేస్ బౌలింగ్ బాగోలేదు’ అంటూ ట్వీట్ చేశాడు.
దీనికి ఓ నెటిజన్... ‘బాస్... నువ్వెప్పుడూ పేస్ బౌలింగ్ చేయలేదు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కి ఘాటుగా స్పందించిన ఇర్ఫాన్ పఠాన్... ‘నువ్వు టీమిండియాకి ఎప్పుడైనా ఆడావా? నువ్వు స్వింగ్ వేయగలిగిన బౌలర్‌తో మాట్లాడుతున్నావు’ అంటూ సమాధానం ఇచ్చాడు. నెటిజన్లు కూడా స్వింగ్ కింగ్‌కి సపోర్టుగా కామెంట్లు చేస్తున్నారు.