
165 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. సామ్ కుర్రాన్ వేసిన మొదటి ఐదు బంతులను డిఫెన్స్ చేసిన కెఎల్ రాహుల్, ఆరో బంతికి షాట్‌కి ప్రయత్నించి, కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 2020లో ఆస్ట్రేలియా టూర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో డకౌట్ అయిన కెఎల్ రాహుల్, గత మ్యాచ్‌లో 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. నేటి మ్యాచ్‌లో డకౌట్ కావడంతో గత మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు కెఎల్ రాహుల్.
మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాకపోయినా రెండో ఓవర్ మొదటి బంతినే బౌండరీకి పంపించి, అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు ఇషాన్ కిషన్. విరాట్ కోహ్లీ కూడా ఓ సింగిల్ తీయడంతో రెండో ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్‌లోనూ ఇషాన్ కిషన్ ఓ చక్కని బౌండరీ సాధించాడు.