గుండు కొట్టించుకుని సాధువుగా మారిన ధోనీ... మళ్లీ మెగాస్టార్‌లా మోసం చేయలేరంటూ...

Published : Mar 14, 2021, 07:35 PM IST
గుండు కొట్టించుకుని సాధువుగా మారిన ధోనీ... మళ్లీ మెగాస్టార్‌లా మోసం చేయలేరంటూ...

సారాంశం

 ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందు న్యూ లుక్‌లోధోనీ... ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రోమో కోసం సాధువులా మారిన మాహీ భాయ్... మళ్లీ మోసం చేయలేరంటూ అభిమానుల కామెంట్...

క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీకి మించిన ట్రెండ్ సెట్టర్ ఉండరేమో. జుంపాల జుట్టుతో ఎంట్రీ ఇచ్చి, రకరకాల హెయిర్ స్టైల్స్, బియర్డ్ స్టైల్స్‌ను ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేశాడు మాహీ. గత సీజన్‌లో ట్రెండీ కట్‌తో ఎంట్రీ ఇచ్చిన ధోనీ, ఆ తర్వాత గుండు కొట్టించుకుని కూల్ లుక్‌లో కనిపించాడు.

తాజాగా ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందు గుండు కొట్టించుకుని సాధువులా మారాడు ధోనీ భాయ్... ఐపీఎల్ 2021 సీజన్ ప్రోమో కోసం సాధువు అవతారంలో కనిపించాడు మహేంద్ర సింగ్ ధోనీ... అయితే కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి గుండు గీయించుకున్నట్టు ఫోటో ప్రత్యేక్షం అయింది.

అయితే అది మేకప్ ద్వారా జట్టుని కవర్ చేసి, బాల్ హెడ్‌లా కనిపించేలా చేసిన ఆర్టిఫిషియల్ గుండు అని తర్వాత తెలిసింది. మాహీ విషయంలో కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయి ఉంటారని, యాడ్‌లో చూస్తుంటేనే అది నిజం గుండు కాదని అర్థం అవుతోందని అంటున్నారు అభిమానులు. 

PREV
click me!

Recommended Stories

virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే