నువ్వు వెంటనే ఆట మొదలుపెట్టు.. రహానేని ట్రోల్ చేసిన రోహిత్ శర్మ

Published : Jun 11, 2020, 09:38 AM ISTUpdated : Jun 11, 2020, 10:20 AM IST
నువ్వు వెంటనే ఆట మొదలుపెట్టు.. రహానేని ట్రోల్ చేసిన రోహిత్ శర్మ

సారాంశం

ఈ లాక్ డౌన్ కారణంగా ఎక్కువ సేపు ఇంటికే పరిమితం అవ్వడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. కాగా.. తాను అలాంటి మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి తన పాత ఫోటోలు చూసుకుంటానంటూ రహాన్ ఇటీవల ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా ఎక్కువ సేపు ఇంటికే పరిమితం అవ్వడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. కాగా.. తాను అలాంటి మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి తన పాత ఫోటోలు చూసుకుంటానంటూ రహాన్ ఇటీవల ట్విట్టర్ లో పోస్టు చేశాడు. కాగా.. ఆ ట్వీట్ కి రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు.

 

‘‘ ప్రతిరోజూ నాకంటూ నేను కొంత సమయం కేటాయించుకుంటాను. నా ఆలోచలను రీసెట్ చేసుకుంటాను. నా  పాత ఫోటోలను చూస్తాను. ఇది మెదడు ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది’’ అంటూ ల్యాప్ టాప్ ముందు కూర్చొని ఉన్న ఫోటోని ఒక దానిని రహాన్ షేర్ చేశాడు.

 

కాగా.. దానికి వెంటనే రోహిత్ శర్మ హిలేరియస్ కామెంట్ పెట్టాడు. ‘‘ నువ్వు ఎంత త్వరగా వీలైంత అంత త్వరగా క్రికెట్ ఆడటం మొదలుపెట్టాలి బ్రదర్’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా.. వీరి ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా.. ఈ ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తరపున ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ వీరిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !