డారెన్ సామి ఆరోపణలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇశాంత్ శర్మ

By Sree sFirst Published Jun 10, 2020, 8:55 AM IST
Highlights

తాను హైదరాబాద్ తరుఫున ఆడుతున్నప్పుడు తనను కాలు అని పిలిచేవారని సామి బాహాటంగా నే అన్నాడు. ఇప్పుడు తాజాగా డారెన్ సామిని నిజంగానే మన టీం ఇండియా సభ్యులు అలా అన్నారు అనడానికి ఆధారాలు బయటపడుతున్నాయి. 

జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తరువాత ప్రతిచోటా తాము ఎదుర్కొన్న జాత్యహంకారం గురించి అందరూ బయటపెడుతున్న ఉన్నారు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ సైతం తాను ఇలా వర్ణ వివక్షను ఎదుర్కొన్నాను అన్నాడో లేదో... విండీస్ జట్టుకే చెందిన మరో ప్లేయర్ డారెన్ సామి సైతం తాను ఐపీఎల్ లో ఆడుతుండగా ఎదుర్కొన్న వర్ణ వివక్ష గురించి బయటపెట్టాడు. 

తాను హైదరాబాద్ తరుఫున ఆడుతున్నప్పుడు తనను కాలు అని పిలిచేవారని సామి బాహాటంగా నే అన్నాడు. ఇప్పుడు తాజాగా డారెన్ సామిని నిజంగానే మన టీం ఇండియా సభ్యులు అలా అన్నారు అనడానికి ఆధారాలు బయటపడుతున్నాయి. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇషాంత్‌ శర్మ 2014లో చేసిన ఓ ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్ట్‌ సామీ వ్యాఖ్యలను బలపరుస్తున్నాయి. భువనేశ్వర్‌ కుమార్‌, డేల్ స్టెయిన్‌, డారెన్‌ సామీలతో కలిసి ఉన్న ఆ ఫోటోలో స్టెయిన్‌ను గన్‌గా సంబోధించిన ఇషాంత్‌... డారెన్‌ సామీని కాలూ అని పిలిచాడు. 2014లో వివిఎస్ లక్ష్మణ్ పుట్టినరోజు బర్త్ డే పార్టీ సందర్భంగా దిగిన ఫొటోలో ఈ కామెంట్ చేసాడు ఇషాంత్ శర్మ. ఇషాంత్‌ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Me, bhuvi, kaluu and gun sunrisers

A post shared by Ishant Sharma (@ishant.sharma29) on May 14, 2014 at 9:18am PDT

ఇదిలా ఉండగా డారెన్‌ సామీ పట్ల వర్ణ వివక్ష వ్యాఖ్యలను సమర్థించుకునే తత్వం మరింత ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాది క్రికెటర్లను అలా పిలవటం సహజమేనని కొందరు, నలుపు రంగులో ఉన్న వారిని హాస్యం కొద్ది అలా పిలువటం సర్వసాధారణమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వివక్ష ఏ రూపంలో ఉన్నా, అది వివిక్షే. అందరూ ఆ పేరుతో హాస్యంగా పిలుస్తారని దానికి సామాజిక ఆమోద ముద్ర వేయలేం కదా!. 

ఐపీఎల్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో విదేశీ క్రికెటర్లు తొలుత నేర్చుకునేది హిందీ బూతు పదాలే అని ఎంతోమంది బహిరంగంగానే చెప్పారు. ఆ విదేశీ క్రికెటర్లకు ఇండియన్‌ క్రికెట్‌ కల్చర్‌ పట్ల ఆ భావం ఏర్పడేలా చేసింది మన అభిమాన క్రికెటర్లే. ఇప్పుడైనా భారత క్రికెట్‌ స్టార్లు ముందుకొచ్చి వర్ణ వివక్ష పట్ల వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంత జరుగుతున్నా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంఛైజీ యాజమాన్యం సైతం డారెన్‌ సామీ వ్యాఖ్యల పట్ల స్పందించేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. 

click me!